ప్రేమించమంటూ తాజ్‌ మహల్‌ బొమ్మతో ఆ పని చేశాడు.. పోలీసులు కేసు నమోదు చేశారు

ప్రేమ అనేది రెండు అక్షరాల పదం, ఇద్దరి మద్య ఉంటేనే అది ప్రేమ అనిపించుకుంటుంది.అవతలి వారి ఉద్దేశ్యంను పట్టించుకోకుండా, ఫీలింగ్స్‌ను పట్టించుకోకుండా ప్రేమ ప్రేమ అంటే అది ఎంత మాత్రం ప్రేమ కాదు.

 Lover Throws Taj Mahal On His Lover Father Goes Viral In Social Media-TeluguStop.com

ఇద్దరి మద్య ఉండే ఆప్యాయత, ఒక ఫీలింగ్‌ను ప్రేమ అంటాం తప్ప, ఒక్కరి భావనను ప్రేమ అనవద్దని ఒక సినీ కవి అన్నాడు.ఆ విషయం ఆ వ్యక్తి వద్దకు వెళ్లలేదేమో, ఢిల్లీకి చెందిన జీతు తాను ప్రేమిస్తున్నాను, నన్ను ఆ అమ్మాయి ప్రేమించడం లేదు అంటూ దాడికి ప్రయత్నించాడు.

అది కూడా ప్రేమకు చిహ్నం అయిన తాజ్‌ మహల్‌ తో.!

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన జీతు అనే కుర్రాడు చాలా కాలంగా ఒక యువతి వెంట పడుతున్నాడు.ఆ యువతి మాత్రం ప్రేమ గీతా మా ఇంట్లో ఒప్పుకోరు, నాకు ఆసక్తి లేదు అంటూ చెబుతూ వచ్చింది.ఇంట్లో వారి సంగతి వదిలేయ్‌, వారిని నేను ఒప్పిస్తా, దయచేసి నువ్వు నన్ను ప్రేమించు అంటూ నెలల తరబడి ఆమె వెంట పడుతూనే ఉన్నాడు.

ఆమె ఓపిక నశించింది.అతడి ప్రేమను తిరష్కరించి, తిట్టి పంపించింది.అయినా కూడా అతడు వెంట పడటం మానలేదు.ప్రేమకు చిహ్నం అయిన తాజ్‌ మహల్‌ బొమ్మను తీసుకు వచ్చి దాన్ని తీసుకుని నా ప్రేమను అంగీకరించు అంటూ వేదించడం మొదలు పెట్టాడు.

గురువారం సాయంత్రం సమయంలో ఆమె ఇంటికి జీతు వెళ్లాడు.ఇంటి బయట ఆమె కోసం వెయిట్‌ చేశాడు.ఆమె బయటకు వచ్చిన సమయంలో తన వద్ద ఉన్న తాజ్‌ మహల్‌ బొమ్మను విసిరేసి తన ప్రేమను అంగీకరించు అన్నాడు.అయితే ఆ బొమ్మ కాస్త అమ్మాయి వద్దకు కాకుండా, అమ్మాయి తండ్రికి బలంగా తలిగింది.

అతడికి రక్తం కూడా రాబట్టింది.దాంతో జీతూపు అమ్మాయి తండ్రి పోలీసు కేసు పెట్టాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు జీతును అదుపులోకి తీసుకున్నాడు.తాజ్‌ మహల్‌ గిఫ్ట్‌ను సున్నితంగా ఇవ్వాలి కాని, ఇలా విసిరేయడం ఏంట్రా అంటూ పోలీసులు జీతూతో సరదాగా అంటున్నారు.

ఈ వింత లవ్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube