వాట్సప్‌లో కొత్త ఫీచర్‌... దీంతో వాట్సప్‌ వాడటం మరింత సులభం, సుఖం.. తప్పకుండా తెలుసుకోండి

వాట్సప్‌ ప్రతి రోజు జీవితంలో భాగస్వామ్యం అయ్యింది.ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, ఆ ఫోన్‌ లో వాట్సప్‌ అనేది చాలా కామన్‌ అయ్యింది.

 Voice To Text In Whatsapp-TeluguStop.com

వాట్సప్‌ పెద్ద ఎత్తున వినియోగిస్తున్న నేపథ్యంలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ తీసుకు వస్తున్నారు.వాట్సప్‌ రెండు సంవత్సరాల క్రితంకు ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి.

అద్బుతమైన ఫీచర్స్‌తో వాట్సప్‌ అత్యంత ప్రజారంజకంగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది.ఈ నేపథ్యంలో వాట్సప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది.

వాట్సప్‌లో ఇప్పటికే వాయిస్‌ మెసేజ్‌ ఉన్న విషయం తెల్సిందే.అయితే ఇప్పుడు వాట్సప్‌ లో కొత్త ఫీచర్‌ వచ్చింది.అదేంటి అంటే మనం ఏదైతే మాట్లాడుతామో అది టెక్ట్స్‌ రూపంలో మారుతుంది.అలా టెక్ట్స్‌ రూపంలో మారి, సాదారణ టెక్ట్‌ మెసేజ్‌ మాదిరిగానే అవతలి వారికి వెళ్తుంది.

అంటే ఇకపై వేల్లు పోయేలా మెసేజ్‌ లు టైప్‌ చేయాల్సిన పని లేదు.కేవలం వాయిస్‌తో కమాండ్‌ చేస్తే మాత్రం టెక్ట్స్‌ దానంతట అదే టైప్‌ అవుతుంది.

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్‌ను థర్డ్‌ పార్టీ వారు అందిస్తున్నారు.ఈ థర్డ్‌ పార్టీ యాప్‌ను వాట్సప్‌ తాజాగా తీసుకు వచ్చిందని తెలుస్తోంది.త్వరలోనే ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులోకి రాబోతుంది.ప్రస్తుతం ఇది బీటా వర్షన్‌లో మాత్రమే కొనసాగుతుంది.త్వరలోనే కొత్త వర్షన్‌ వాట్సప్‌ను విడుదల చేస్తారని, అందులో ఈ వాయిస్‌ టెక్ట్స్‌ కన్వర్ట్‌ రాబోతుందని చెబుతున్నారు.ఇప్పటికే వాట్సప్‌ అత్యంత ఆకట్టుకునే సేవలను అందిస్తుంది.

ఈ క్రమంలో మరింతగా వాట్సప్‌ వినియోగదారులకు హెల్ప్‌ అయ్యేలా ఈ ఫీచర్‌తో రాబోతుంది.అయితే ఈ ఫీచర్‌ తెలుగు సేవలను అందించబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube