మిల్కిబ్యూటీ తమన్నా చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెలిసిందే.ఈ మధ్య కాస్త ఈమె క్రేజ్ కాస్త తగ్గింది.
తెలుగు లో తాజాగా ఈమె ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది.సినిమా కు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో తమన్నా మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు.
ప్రస్తుతం తమన్నా తమిళం లో బిజీగా వుంది.ఇదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఆమె అనారోగ్యం గురించి బాధపడుతున్నాట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం తమన్నా గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాట్లుగా తెలుస్తోంది.ఈమె గత కొంత కాలంగా బిజీ గా షూటింగ్స్ కు హాజరు అవుతోంది.ఆ కారణంగా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నాట్లుగా చెబుతున్నారు.

కొన్ని రోజుల క్రితం ఈమె హాస్పిటల్ కు వెళ్లిన సమయంలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారట.కానీ తమన్నా మాత్రం విశ్రాంతి నో చెప్పింది.వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.
ప్రస్తుతం కూడా తమన్నా తమిళం లో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.దాంతో ఆమె మరింతగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు.
అనారోగ్యం వల్ల తమన్నా లావు కూడా పెరిగింది.







