తెలుగు బిగ్ బాస్ సీజన్ 1కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేయడం వల్ల మంచి టీఆర్పీ దక్కింది.ఇక సీజన్ 2లో మాత్రం కౌశల్ ఉండటం వల్ల మంచి టీఆర్పీ దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్న కౌశల్ సీజన్ విజేతగా నిలిచాడు.మూడవ వారంలోనే సీజన్ 2 విజేత కౌశల్ అంటూ తేలిపోయింది.
అతడి పద్దతి, అతడి మాట విధానంకు ఫిదా అయిన జనాలు సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ అంటూ ఒకటి ఫామ్ అయ్యి కౌశల్ బాధ్యతను తమ బుజాలపై వేసుకున్నారు.

తనను గెలిపించిన కౌశల్ ఆర్మీ కోసం ఏదో ఒకటి చేస్తానంటూ విన్నర్‌గా నిలిచినప్పటి నుండి కూడా కౌశల్ చెబుతూ వస్తున్నాడు.కౌశల్ ఆర్మీ వల్లే తాను గెలిచానని పలు సార్లు కౌశల్ చెప్పి తన అభిమానులను ఆకాశానికి ఎత్తాడు.ఆమద్య కౌశల్ ఆర్మీ క్రౌండ్ ఫడ్డింగ్‌తో ఒక సినిమాను కౌశల్‌తో తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం కౌశల్ హీరోగా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథకు కౌశల్ ఓకే చెప్పాడట.మీడియం బడ్జెట్‌తో సినిమాను నిర్మించేందుకు నిర్మాత కూడా రెడీ అయ్యాడట.
వేసవిలో సినిమాను పట్టాలెక్కించేందుకు కౌశల్ అండ్ టీం ప్రయత్నాలు చేస్తున్నారట.కౌశల్ హీరోగా మంచి లుక్‌ను కలిగి ఉంటాడు.
కనుక అతడు హీరోగా సక్సెస్ అవుతాడని విశ్లేషకులు అంటున్నారు.

కౌశల్ హీరో అవ్వడం కౌశల్ ఆర్మీకి చెందిన ప్రతి ఒక్కరి కృషిగా చెప్పుకోవాలి.కౌశల్ హీరోగా మారబోతున్నాడనే ఈ విషయం కౌశల్ ఆర్మీలోని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి.







