నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు.
అన్న గారి పాత్రలో బాలయ్య బాబు గారు ఒదిగిపోయారు అంటున్నారు సినిమా చూసిన వారంతా.
అందరు ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో…ఈ సినిమాపై లక్ష్మి పార్వతి గారు స్పందించారు.న్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని చూడమని తనకి చిత్రబృందం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు.చంద్రబాబు డైరెక్షన్ లోనే ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది.
అసలు ఇందులో నిజాలు చూపించే అవకాశమే లేదన్నారు లక్ష్మీ పార్వతీ.రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అసలు నిజాలు చూడబోతున్నారు.
ఉన్నది ఉన్నట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందించే ధైర్యం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే వుందని ఆమె చెప్పుకొచ్చారు.