కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ అంతటా ఈనెల 8న మంగళవారం ఆటోలు, స్కూల్ వ్యాన్‌లు, క్యాబ్‌ల బంద్ పాటించనున్నట్లు ఆటో మోటార్ రంగ కార్మిక సంఘాలు ప్రకటించాయి.కేంద్ర ప్రభుత్వం ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును బలవంతంగా వసూల్ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.దీనిలో భాగంగా….8న ఆటోల బంద్, 9న నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.
ఇక మరోపక్క మంగళ, బుధవారాల్లో జరిగే బంద్ లో కొన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొంటున్నాయి.ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (AIBEA), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఈ బంద్ లో పాల్గొంటున్నట్లు తెలిపాయి.దీంతో ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా మరికొన్ని బ్యాంక్ ల సేవలకు అంతరాయం కలుగుతుంది.