అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే.అంతేకాదు విదేశీయుల జాబితాలో అత్యధిక స్థాయిలో గ్రీన్ కార్డులు పొందిన ఎన్నారైలు కూడా భారతీయులే కావడం విశేషం అయితే.
ఈ గ్రీన్ కార్డులు జారీలో దేశాలకి విధించిన కొటాల వల్ల వాటికోసం సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.అందుకే ఈ కొతాని ఎత్తేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే కోటాని ఎత్తేయడం ద్వారా అమెరికా పౌరసత్వం పొందే వారిలో భారత్ ,చైనాల హవా ఉంటుందని తాజా నివేదిక వెల్లడించింది.అయితే ఈ కొతాని ఎత్తేయాలని అందుకు చట్టం రావాలని ఎంతో మంది ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్‌ఎస్) ఇటీవల దేశాల కోటా, శాశ్వత ఉపాధి తదితర అంశాలపై నివేదిక తయారుచేసింది…ఈ నివేదికలో భాగంగా.

అమెరికా లో ప్రశుతం దేశాల మధ్య ఉన్న వివక్ష తోలిగిపోతుందని అయితే దీనివల్ల భారత్ చైనా రెండు దేశాల పౌరసత్వం అమెరికాలో ఎక్కువగా అవుతుందని దాంతో వారికి ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందని సీఆర్ఎస్ తన నివేదికలో వెల్లడించింది.యుస్‌సీఐఎస్ తాజా నివేదిక ప్రకారం.

2018 ఏప్రిల్ నాటికి 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.వీరిలో 3,06,601 మంది భారతీయులే ఉండటం గమనార్హం.ఇక భారత్ తరువాత 67,031 మందితో చైనా రెండో స్థానంలో ఉంది.
అయితే ప్రస్తుత నిభందన ప్రకారం గ్రీన్ కార్డ్ పొందాలి అంటే ఏళ్ల తరబడి వేచి చూడాలి.కాని ఈ కొతాని ఎత్తేస్తే మాత్రం గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూసే భారతీయుల సంఖ్య భారీగా తగ్గుతుందని అంటూ సీఆర్‌ఎస్ తెలిపింది.







