సినీ, రాజకీయ రంగాల్లో పేరుగాంచిన నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.మొదటి భాగంలో సినిమా కెరియర్ గురించి, రెండో భాగం గురించి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి చిత్రీకరిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.ఈ చిత్ర మొదటి పార్టును జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే సన్నాహాలు షురూ చేశారు.
కాగా తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ‘ఎన్టీఆర్’పై స్పందించారు.

గతంలో ఎన్టీఆర్‌పై నాదెండ్ల తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే.అయితే ఈ విషయమై సినిమాలో తన గురించి నెగిటివ్‌గా చూపిస్తే పరిణామలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.అంతేకాకుండా ఈ చిత్రాన్ని మొదలుపెడుతున్నప్పుడే తన గురంచి దుష్ప్రచారం చేస్తే తాటా తీస్తా అని కోర్టు నోటీసులు కూడా పంపించారు.
నాదెండ్ల పదేపదే ఇదే విషయాన్ని చెబుతుండడంతో ఈయన గురించి నిజంగానే నెగిటివ్‌గా చూపించనట్టు ఈయనకు సమాచారం ఉందా? అనే సందేహాలు వస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేంద్రంతో గొడవ పడితే ఏది రాదు, సఖ్యతతో ఉండి అన్ని పనులు చేయించుకోవాలి.కేంద్రంతో తగాదా పెట్టుకుంటే చివరకు నష్టపోయేది రాష్ట్ర ప్రజలే అని నాదెండ్ల చెప్పుకొచ్చారు.ఇక ‘ఎన్టీఆర్’ చిత్రంలో ఎవరి గురించి నెగిటివ్‌గా చూపించిన అందరు లీగల్ నోటీసులు అంటున్నారు.

దాంతో ‘ఎన్టీఆర్’ అంశం ఎవరిని కాంట్రవర్శియల్ చేయకుండా చప్పగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేక ఎన్టీఆర్ నిజ జీవితంలోని వారిని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారా అనేది ఆసక్తిగా మారింది.ఒకవేళ అలా చూపిస్తే తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.







