తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టయిల్‌లో సినిమాలు చేసి పవర్‌స్టార్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు పవన్‌కళ్యాణ్.మెగా హీరోలందరిలో పవన్‌కళ్యాణ్ అభిమాన వర్గం చాలా పెద్దది.
ఏ మెగా హీరో కార్యక్రమం అయినా కూడా అక్కడికి వచ్చిన వారు పవన్ గురించి అడగక మానరు.అలాంటిది పవన్ గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఈయన అభిమానుల మానియా మాత్రం అస్సలు తగ్గడం లేదు.

పవన్ అభిమానులు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా పవనను దేవుడిలా ఆరాధిస్తారు అభిమానులు.గతకొంత కాలంగా సినిమాకు దూరంగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాడు పవన్.
జనసేన పార్టీ తరుపున చాలా చోట్ల పోటీ చేయడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు.తాజాగా పవన్ అభిమాని ఒకరు ప్రముఖ బుల్లితెర యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీగౌతమ్‌ను పవన్‌కళ్యాణ్ గురించి అడిగారు.
పవన్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవుతాడా? అని ప్రశ్నించాడు.కాగా మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు పవన్‌పై చాలా నమ్మకంగా ఉన్నారు.
కాబట్టి ఆ మార్పును తీసుకు వచ్చే సత్తా పవన్‌కు ఉంది.

పదవుల కోసం కాకుండా కేవలం ప్రజా సేవే లక్ష్యంగా పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన పవన్‌కు జనం మద్దతుగా ఉన్నారు.ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ అదే ధ్యేయంతో పోరాడుతున్నారు.పవన్ కచ్చితంగా మార్పును తీసుకువస్తాడు అని ధీమా వ్యక్తం చేసింది.
రష్మీ వ్యాఖ్యలకు గాను అంతా షాకవుతున్నారు.పవన్ కళ్యాణ్‌పై ఈ అమ్మడికి గట్టి నమ్మకం ఉంది.
ఇకపోతే సినీ రంగం నుండి పవన్‌కు మంచి సపోర్ట్ ఉంది.మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, జగన్‌కు పోటీగా నిలిచి పవన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో వేచి చూడాల్సిందే.







