ఏపీ తెలంగాణాలో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం స్పందన ఇదే !

ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నట్టు అప్పట్లో రాజకీయ పార్టీలు చాలా ఆశపడ్డాయి.కానీ ఇప్పటివరకు కేంద్రం ఆ విషయం మీద స్పందించలేదు.

ఆ అంశాన్ని నాన్చుతూ.వచ్చింది.

ఈ లోపుగా తెలంగాణాలో ఎన్నికలు కూడా ముగిసిపోయాయి.తాజగా ఈ అంశం పై కేంద్రం స్పందించింది.

ఇప్పట్లో.ఏపీ ,తెలంగాణలలో అసెంబ్లీ సీట్ల పెంపుదల సాధ్యం కాదని స్పష్టం చేసింది.

Advertisement

విభజన చట్టంలో సీట్ల సంఖ్య పెంచాలని పెట్టినప్పుడు రాజ్యాంగం ప్రకారం 2026లోనే సీట్లను పెంచడం సాధ్యం అవుతుందని కేంద్రం తెలిపింది.

ఎపిలో 175 సీట్లను 225 సీట్లకు, తెలంగాణలో 119 సీట్లను 153 సీట్లకు పెంచాలని అప్పట్లో విభజన చట్టంలో పేర్కొన్నారు.దీని ప్రకారంగానే.తెలంగాణ, ఏపీలలో అధికార పార్టీలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం చేశాయి.

అయితే కేంద్రం దీనిపై అటార్నీజనరల్ అభిప్రాయం కోరగా, రాజ్యాంగం ప్రకారం కొత్త జనాబా లెక్కల ప్రకారమే సీట్లను పెంచవలసి ఉంటుందని తేల్చేశారు.దీని ప్రకారం.2026లోనే నియోకవర్గాల పెంపుదల ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు