తమిళ మరియు తెలుగు సినీ పరిశ్రమల్లో వరలక్ష్మి మరియు విశాల్‌లు ప్రేమించుకుంటున్నారనే విషయం ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు.ఇద్దరి మద్య ప్రేమ పీక్స్‌లో ఉందని కొందరు అంటూ ఉంటారు.
అలాంటి వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, అదుగో పెళ్లి, ఇదిగో పెళ్లి అంటూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా మరోసారి వీరిద్దరి పెళ్లికి సంబంధించిన విషయం ‘సర్కార్’ సమయంలో వచ్చింది.
కాని సర్కార్ సమయంలో వరలక్ష్మి మాట్లాడుతూ తాను విశాల్‌ను ప్రేమించడం లేదని, అతడి పెళ్లి ఎప్పుడు, ఎవరితో అవుతుందో అని అందరిలాగే నేను ఎదురు చూస్తున్నాను అంది.

ఇప్పటి వరకు వరలక్ష్మి తనకు విశాల్ మంచి మిత్రుడు అంటూ చెప్పుకొచ్చింది.అయినా కూడా ఇద్దరి మద్య ప్రేమ ఉండి ఉంటుందనే ప్రచారం జరిగింది.కాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మీకు సినీ ఇండస్ట్రీలో చంపేయాలన్నంత కోపం ఎవరిపై ఉందని ప్రశ్నించగా, ఏమాత్రం ఆలోచించకుండా నాకు చంపే అవకాశం వస్తే మాత్రం వెంటనే విశాల్‌ను చంపేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.ఎంతో ప్రేమించుకుంటున్నారు అని భావిస్తున్న జనాలు వరలక్ష్మి మాటతో అవాక్కవుతున్నారు.

ఇప్పటి వరకు వరలక్ష్మి, విశాల్‌లు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటా అంటూ ఎదురు చూస్తున్న వారి అభిమానులకు ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అని అంటూ ఉన్నారు.అయితే కొందరు మాత్రం దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు.విశాల్‌పై ప్రేమతోనే ఆమె చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేసిందేమో, ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా కూడా తప్పకుండా విశాల్ మరియు వరలక్ష్మిలు వివాహం చేసుకుంటారనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.వారి అభిమానులు కూడా అందుకోసం ఎదురు చూస్తున్నారు.







