విజయ్‌ దేవరకొండ మరో ‘నోటా’.. మళ్లీ మళ్లీ అదే తప్పు ఎందుకు కొండ?

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాల తర్వాత ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ‘నోటా’ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.

 Another Nota Movie For Vijay Devarakonda In Tamil And Telugu-TeluguStop.com

తమిళ ఫ్లేవర్‌ ఎక్కువ అయ్యిందని, కథ బలంగా లేదని పలు రకాలుగా విమర్శలు ఎదురయ్యాయి.అయితే తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌ క్రేజ్‌తో సునాయాసంగా బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకుంది.

దాంతో మనోడు మళ్లీ ద్వి భాష చిత్రాల జోలికి వెళ్లడని అంతా భావించారు.కాని విజయ్‌ దేవరకొండ మరోసారి ‘నోటా’ తరహాలో ద్వి భాష చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ నిర్మాత ఎస్‌ ఆర్‌ ప్రభు భారీ మొత్తంను విజయ్‌ దేవరకొండుకు ఆఫర్‌ చేశాడని, ఇప్పటికే అడ్వాన్స్‌ కూడా ఇచ్చి తెలుగు మరియు తమిళంలో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.విజయ్‌ దేవరకొండుకు శ్రీకార్తిక్‌ అనే యువ దర్శకుడు స్టోరీ చెప్పడం, అది విజయ్‌కి నచ్చడం అంతా జరిగి పోయిందని తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కోసం శ్రీకార్తిక్‌ తో స్క్రిప్ట్‌ వర్క్‌ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.వచ్చే ఏడాదిలో ద్వి భాష చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని తెలుస్తోంది.మరో వైపు విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంతో పాటు ఇంకా పు సినిమాలకు కూడా కమిట్‌ అయ్యాడు.నోటా ఫ్లాప్‌ అయినా తమిళనాట గుర్తింపు దక్కించుకునేందుకు ఈయన తెగ ఆరాటపడుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube