ఎవరైనా ఏదైనా ఇస్తే మళ్ళీ తిరిగిచ్చెయ్యాలి లేకపోతే లావు అయిపోతారని శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగు బాగా పాపులర్ అయ్యింది.ఇప్పుడు అదే డైలాగును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో వాడేస్తున్నాడు.
నిన్న తెలంగాణాలో ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా తో మాట్లాడిన కేసీఆర్ చంద్రబాబు మీద పంచ్ డైలాగులు వేసాడు.తెలంగాణాలో మామీద ఇంత కుట్ర చేసిన బాబు ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడ్డంపై ఇపుడు అందరూ అనేక విశ్లేషణలు చేసుకుంటున్నారు.

మాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం తప్పదు అని కేసీఆర్ చెప్పడం సంచలనం సృష్టించింది.తెలంగాణ పాలిటిక్స్ లో ఎపి సీఎం వేలుపెట్టడాన్ని టీఆర్ఎస్ ముందు నుంచి తప్పు పడుతూ వచ్చింది.కేసీఆర్ వ్యాఖ్యలకు ముందు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనే పుట్టలో వేలుపెడితే చీమలు కూడా కుడతాయని మరి పక్క రాష్ట్ర చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే చూస్తూ సహించమని ఏపీలో కూడా తమ జోక్యం ఉంటుందని ముందే హెచ్చరించారు కేటీఆర్.ఆ విషయాన్నీ తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చాక కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు.
చంద్రబాబు కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణ వారికి సంస్కారం లేదంటారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కేసీఆర్.

అయితే కేసీఆర్ ఇలా మాట్లాడడం చూస్తే ఆయన బాబు మీద ప్రతీకారంతో రగిలిపోతున్నట్టే కనిపిస్తోంది.కేసీఆర్ ఏపీలో బాబు కి ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటా అనే చర్చ మొదలైంది.ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు.
బాబు ని టార్గెట్ గా చేసుకుని మరీ నెటిజెన్స్ రకరకాల పోస్టింగ్స్ పెడుతున్నారు.తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఓటుకు నోటు కేసును మళ్ళీ బయటకి తీసి బాబు కి గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దమవ్వబోతున్నాడు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా.రాజకీయంగా … చంద్రబాబు కి విరోధులుగా ఉన్న జనసేన, వైసీపీ అధినేతలు పవన్ జగన్ లకు రాజకీయంగా అండదండలు అందించి ఏపీలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు కూడా అర్ధం అవుతోంది.
ఇదే కేసీఆర్ ఇస్తానన్న గిఫ్ట్స్ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.







