కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ ఇవన్నీ తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటై చేతులు కలిపినవారే.కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా వీరంతా ఎన్నికల రణరంగంలోకి ముందుకు దూకారు.
ఈ సందర్భంగా వీరంతా ప్రజకూటమిగా ఏర్పడ్డారు.ఇంకేముంది గులాబీ పార్టీ సీన్ అయిపొయింది అనుకున్నారు అందరు.
కానీ కేసీఆర్ మాత్రం ముందస్తు ఎన్నికలకు ఎంతయితే కంగారుపడ్డాడో అంతే వేగంగా ప్రభుత్వాన్ని రద్దు చేయడం… పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.కానీ ఈ విషయంలో ప్రజాకూటమి మాత్రం తప్పటడుగులు అనేకం వేసింది.
చివరి వరకు అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేసుకోవడానికే కూటమిలోని పార్టీలకు సమయం సరిపోలేదు.అసలు తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ముందు నుంచి సంకేతాలు వస్తున్నా… అందుకు కాంగ్రెస్ ఆ పార్టీ మిత్రపక్షాలు అందుకు అనుగుణంగా సిద్ధం కాలేకపోయారు.

ప్రజాకూటమి వేసిన తప్పటడుగుల్లో ప్రధానంగా చూసుకుంటే… ఒకవైపు అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన, సభలు, సమావేశాలతో, జెట్ స్పీడ్ తో కేసీఆర్ ఎన్నికల సమరంలోకి దూసుకెళ్తుంటే, ప్రజాకూటమి మాత్రం అవేమి తమకు పట్టనట్టు వ్యవహరించింది.పొత్తులు తేల్చడంలో కాలపయాన చేసింది.తీవ్ర గందరగోళంతో కొట్టుమిట్టాడింది.నామినేషన్ల చివరి తేదీ వరకూ అభ్యర్థులను ఫైనల్ చేయలేకపోయింది.టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు సీట్లు ఇవ్వడంలో నాంచివేత ధోరణి అమలు చేసింది.కూటమిలో అలకలు- సీట్ల సర్దుబాటు , బుజ్జగింపులు ఇలా ఉన్న సమయం అంతా వీటితోనే సరిపోయింది తప్ప ఎన్నికల్లో తమ ఉమ్మడి ప్రత్యర్థి టీఆర్ఎస్ ను ఎదుర్కునే అవకాశాలను మాత్రం సమర్ధవంగా వినియోగించుకోలేకపోయింది.

గత ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీకి సెటిలర్స్ నుంచి ఆదరణ బాగానే వచ్చింది.ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అందరూ భావించారు.కాంగ్రెస్ కూడా అదే బలంగా నమ్మింది.ప్రజాకూటమిలో కాంగ్రెస్సే పెద్దన్నయినా, చంద్రబాబే అధినాయకుడిగా కనిపించారు.చంద్రబాబు వెనకాల నడుస్తూ ఉత్తమ్ మీడియాలో కనిపించారు.అప్పటికే బాబును బూచిగా చూపడంలో సక్సెస్ అయిన టీఆర్ఎస్‌కు, ఈ దృశ్యాలు ఆయుధాలయ్యాయి.
సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి.చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే, తెలంగాణలో మరోసారి ఆంధ్రాపార్టీ పెత్తనం పెరుగుతుందన్న టీఆర్ఎస్ ఆరోపణలను ప్రజలు కూడా బలంగా నమ్మారు.
అది తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యింది.

టీఆర్ఎస్ పార్టీ మీద విద్యార్థులు.ఉద్యోగులు… నిరుద్యోగులు ఇలా అంతా వ్యతిరేకత వ్యక్తం చేసినా… దాన్ని సక్రంగా వినియోగించుకోవడంలో కూటమి ఫెయిల్ అయ్యింది.అంతే కాదు టీఆర్ఎస్ మాటల దాడితో కూటమిని ఇరుకునపెడుతూ వచ్చింది.
ఆర్నెళ్లకు ఒకసారి మారిపోయే ఢిల్లీ సీల్డ్ కవర్ సీఎం కావాలా….సింగిల్‌గా సింహంలా ఉండే సీఎం కావాలా అంటూ కేటీఆర్, హరీష్ ఇతర అభ్యర్థులు చేసిన ప్రచారం జనంలో బలంగా చొచ్చుకెళ్లింది.ఇక పొత్తుల వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది.చాలాకాలంగా… పార్టీ కోసం కస్టపడి పనిచేస్తున్న వారిని కాదని కూటమిలో ఉన్న మిత్రపక్ష పార్టీలకు సీటు ఇవ్వాల్సి వచ్చింది.దీంతో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబల్స్ బరిలోకి దిగి కూటమిలోని పార్టీలకు చుక్కలు చూపించడమే కాకుండా కాంగ్రెస్ ఖాతాలో పడాల్సిన ఓట్లు అన్నిటిని చీల్చి అంతిమంగా టీఆర్ఎస్ కి మేలు జరిగేలా చేశారు.







