జనసేన అధికార ప్రతినిధి రాజీనామా !

వరుస చేరికలతో మంచి ఊపు మీద ఉన్న జనసేన పార్టీలోకి పక్క పార్టీల నుంచి నాయకులంతా ఒక్కొక్కరుగా వచ్చి చేరడంతో రోజు రోజుకి జనసేన బలం పుంజుకుంటున్నట్టుగా… కనిపించింది.అయితే అంతర్గతంగా ఆ పార్టీలో ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని… పవన్ కోటరీలో ఉన్న నాయకుల్లో ఒకరంటే ఒకరికి అస్సలు పొసగడం లేదు అంటూ … గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

 Janasena Spoken Speker Vijayababu Regined-TeluguStop.com

తాజాగా… జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విజయ్‌బాబు తన పదవికి రాజీనామా చేశారు.జనసేనను బలోపితం చెయ్యడంలో విజయ్‌బాబు కీలకంగా వ్యవహరించారు.అలాంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చెయ్యడం పట్ల పార్లీ శ్రేణుల్లో ఆందోళన పెంచుతోంది.అయితే… వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేసినట్టు విజయ్‌బాబు చెబుతున్నా ఆయన జనసేనలో ఇమడలేక, పవన్‌ చర్యలు నచ్చకే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.విజయ్‌బాబు గతంలో ఆర్‌టీఐ కమిష‌న‌ర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరినప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి.ప‌వ‌న్ మ‌నోహ‌ర్‌కు ప్ర‌యార్టీ ఇస్తూ మిగిలిన వారిని ప‌క్క‌న పెట్టేస్తున్నార‌న్న చర్చ పార్టీలో మొదలయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube