శృంగార మంత్రగత్తె, తాంత్రిక పూజలు చేసి ఆ సామర్థ్యం పెంచేస్తానంటోంది... స్కైప్‌, వాట్సప్‌ లో కూడా సేవలు

మారుతున్న లైఫ్‌ స్టైల్‌ నేపథ్యంలో శరీరంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.బిజీ లైఫ్‌ లో సరైన ఆహారం తీసుకోక పోవడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపక పోవడం వల్ల ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.

 Srungara Mantra Gathee Skype And Whatsapp Service-TeluguStop.com

ఇక బిజీ లైఫ్‌ అనుభవించే వారికి శృంగార జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నానేది సర్వేలు చెబుతున్న నిజం.ఎంతో మంది శృంగార సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన డాక్టర్లకు పంట పండుతోంది.

డాక్టర్లు మాత్రమే కాకుండా నేను కూడా మీ శృంగార సామర్థ్యంను పెంచుతాను అంటూ షానే మేరి అనే 30 ఏళ్ల యువతి శృంగార మంత్రగత్తె అవతారం ఎత్తింది.దాదాపు పది సంవత్సరాల పాటు పరదేశీ నర్తకిగా, క్లబ్‌ డాన్సర్‌ గా చేసిన షానే మేరి కొన్ని పరిస్థితుల్లో క్షుద్ర శక్తులను ఆరాధించడం మొదలు పెట్టింది.ఆ సమయంలోనే ఆమె తనకు తాను శృంగార మంత్రగత్తెను అంటూ ప్రకటించుకుంది.

తన వద్దకు ఎంత పెద్ద శృంగార సమస్యతో వచ్చినా కూడా వారికి తాంత్రిక పూజలు నిర్వహించడం ద్వారా బాగు చేస్తాను అంటూ చెబుతోంది.

ఆమె గురించి మెల్ల మెల్లగా భారీగా ప్రచారం జరిగింది.దాంతో ఆమెకు భారీ డిమాండ్‌ పెరిగి పోయింది.శృంగార సామర్థ్యం పెంచేందుకు ఆమె చేస్తున్న తాంత్రిక పూజలు సఫలం అవుతున్నాయో లేదో తెలియదు కాని, ఆమెను మాత్రం సంప్రదించే వారి సంఖ్య భారీగా పెరిగి పోతూనే ఉంది.

ఆమెను నేరుగా కవలేని వారు ఆన్‌ లైన్‌ లో అపాయింట్‌ మెంట్‌ తీసుకుని, వాట్సప్‌ లేదా స్కైప్‌ వీడియో కాలింగ్‌ ద్వారా ఆమెతో మాట్లాడి, తమ సమస్యలను చెప్పుకోవచ్చు.అప్పుడే ఆమె కొన్ని తాంత్రిక మంత్రాలు చెప్పించడంతో పాటు, కొన్ని మందులను సజెస్‌ చేస్తుంది.వాటిని పఠించి, ఆ మందులు వాడితే అంతా బాగుంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

కంప్యూటర్‌ యుగంలో ఇంకా తాంత్రిక పూజలు, అది కూడా శృంగార మంత్రగత్తె ఏంటీ అంటూ కొట్టి పారేస్తున్నారు.కాని ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో అంటూ తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇలా ఎవరు ఎదురు పడితే వారి నుండి సాయం తీసుకుంటున్నారు.అలా ప్రస్తుతం శృంగార మంత్రగత్తెగా షానే మేరి టైం నడుస్తోంది.

శృంగార మంత్రగత్తె, తాంత్రిక పూజలు చేసి ఆ సామర్థ్యం పెంచేస్తానంటోంది… స్కైప్‌, వాట్సప్‌ లో కూడా సేవలు -

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube