బ్యాంక్ పై పోరాటం చేసి చివ‌ర‌కు గెలిచిన టీచ‌ర్.!!

ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసినప్పుడు అందులోంచి డబ్బులు వస్తే ఓకే.అలా కాకుండా డబ్బులు రాకుండా అకౌంట్ నుంచి మాత్రం డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది.

 Atm Glitch Causes Woman To Lose Rs 25000 What She Did Next Is-TeluguStop.com

దీంతోపాటు డబ్బులు పోయాయే అనే ఆందోళన కూడా పెరుగుతుంది.అయితే ఆమె కూడా మొదట్లో ఆందోళన చెందింది.

కానీ పక్కా సాక్ష్యాలతో కోర్టులో కేసు వేయగా, చివరకు ఆమెకు ఏటీఎంలో అలా అనవసరంగా కట్ అయిన డబ్బులు వెనక్కి వచ్చాయి.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌కు చెందిన ఎం.చంద్రకళ అదే రాష్ట్రంలోని చిక్కబళ్లపురలో ఓ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది.కాగా ఆమెకు చిక్‌బళ్లపురలోని బీబీ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది.ఈ క్రమంలోనే 2014, మే 7వ తేదీన మధ్యాహ్నం ఆమె చోళనాయకనహళ్లి అనే ప్రాంతంలో ఉన్న ఓ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ.25వేలను తన డెబిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేయడానికి యత్నించింది.అయితే ఏటీఎం నుంచి వింతైన శబ్దం వచ్చింది కానీ క్యాష్ రాలేదు.

కానీ అకౌంట్ నుంచి మాత్రం డబ్బు డెబిట్ అయినట్లు స్లిప్ వచ్చింది.దీంతో ఆమె ఆందోళన చెందింది.పక్కనే ఉన్న మరో ఏటీఎం నుంచి క్యాష్ తీయగా రూ.5వేలు వచ్చాయి.దీంతో ఆమె వెంటనే ఆ స్లిప్‌తో అదే ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లి బ్రాంచ్ మేనేజర్‌కు కంప్లెయింట్ చేసింది.

అయితే ఏటీఎంలో సాంకేతిక సమస్య కారణంగానే అలా జరిగి ఉంటుందిన చెప్పిన ఆ బ్యాంక్ మేనేజర్ ఆమెను తన అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు వెళ్లమని సూచించాడు.దీంతో ఆమె అక్కడికి వెళ్లడమే కాకుండా, బ్యాంక్ అధికారులు సూచించిన విధంగా ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు కూడా చేసింది.అయితే ఫిర్యాదు అయితే చేసింది కానీ.ఆమెకు అసలు ఆ రూ.25వేలు వెనక్కి రాలేదు.దీంతో ఆమె ఆయా ఊర్లలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది.

అయినా ఆమె సమస్యను ఎస్‌బీఐ అధికారులు పరిష్కరించలేదు.దీంతో విసుగు చెందిన చంద్రకళ చివరకు అక్టోబర్ 25, 2014వ తేదీన బెంగళూరులో ఉన్న అర్బన్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్‌జ్యూమర్ డిస్‌ప్యూట్స్ అండ్ రిడ్రస్సల్ ఫోరంలో కేసు వేసింది.

ఆ కేసును చాలా సుదీర్ఘంగా విచారించారు.చివరకు సాక్ష్యాలన్నీ బలంగా ఉండడంతో న్యాయమూర్తి చంద్రకళకు అనుకూలంగా తీర్పునిచ్చారు.ఆమెకు రూ.25వేలను వెనక్కి ఇవ్వడంలో ఎస్‌బీఐ అధికారులు విఫలమయ్యారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతే కాదు, కోర్టు ఖర్చుల కింద ఆమెకు మరో రూ.10వేలను అదనంగా ఎస్‌బీఐ ఇవ్వాలని తీర్పు చెప్పారు.ఏది ఏమైనా ఎస్‌బీఐకి వ్యతిరేకంగా అలా పోరాడి తన డబ్బును తాను దక్కించుకున్న చంద్రకళను మనం అభినందించాల్సిందే.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube