పెద బాబు ఆంక్షలు ... చినబాబు కి బ్రేకులు !

ఏపీ తెలుగుదేశం పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ నెంబర్ 2 స్థానంలో కొనసాగుతూ జూనియర్ ముఖ్యమంత్రిగా … అందరిచే గుర్తింపు పొందిన ఐటీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ గత కొంతకాలంగా సైలెంట్ గా కనిపిస్తున్నాడు.ఎక్కడా హడావుడి చేయడంలేదు.

 Chandrababu Naidu Restrictions On Small Boss At Ap Elections-TeluguStop.com

జిల్లా పర్యటనలకు అస్సలు వెళ్లడమే మానేశారు.అడపాదడపా ట్విట్టర్ ద్వారా జగన్, పవన్ ల మీద సెటైర్లు వేస్తూ… కనిపిస్తున్నాడు తప్ప ఇంకేమి మాట్లాడడంలేదు.

కానీ గత రెండు మూడు నెలల క్రితం సంగతి చూస్తే … లోకేష్ తరుచూ జిల్లాల పర్యటనల్లో బిజీ బిజీ గా గడిపేస్తూ ఉండేవాడు.క్షణం తీరిక లేనట్టుగా ఆయన షెడ్యూల్ ఉండేది.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

లోకేష్ ఒక్కసారిగా సైలెంట్ అవ్వడానికి కారణం వెనుక పెద్ద కథే ఉన్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.మొన్నటివరకు చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతలతో బిజీగా ఉండటంతో పార్టీ లో నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు, నేతల మధ్య సఖ్యత తెచ్చేందుకు లోకేష్ జిల్లా పర్యటనలు చేపట్టారు.ఈయన పర్యటనలతో పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు సమిసిపోతాయని … నేతలంతా ఒక్కటవుతారని బాబు కూడా భావించారు.

కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి సీన్ మొత్తం మారిపోయింది.లోకేష్ పర్యటనలతో పార్టీలో నాయకుల మధ్య విబేధాలు సమిసిపోవడం మాట అటుఉంచితే ఇవి మరింత ముదిరాయి.లోకేష్ పర్యటించిన తర్వాత ఆయా జిల్లాల్లో నేతల మధ్య మరింత గ్యాప్ పెరిగిందని అనేక రిపోర్టులు … ఫిర్యాదులు రావడంతో లోకేష్ ను అమరావతి హద్దు దాటొద్దని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

లోకేష్ పర్యటించిన కొన్ని జిల్లాల్లో పరిస్థితులు పరిశీలిస్తే… ముందుగా… కర్నూలు జిల్లాకు వెళ్లిన లోకేష్ అక్కడ ఎంపీగా బుట్టా రేణుకను, కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రకటించి సంచలనానికి కారణమయ్యారు.లోకేష్ పర్యటనపై అప్పట్లో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు.దీనిపై చంద్రబాబు వద్ద పంచాయతీ కూడా పెట్టారు.

ఇక ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో పర్యటించిన లోకేష్.అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు, ఎమ్మెల్సీ పోతుల సునీతకు మధ్య విబేధాలు ఉండడం… ఈ విబేధాలు లోకేష్ పర్యటనతో మరింత ముదరడం అప్పట్లో టీడీపీ అధినేతను కంగారు పెట్టించాయి.

ఇలా ప్రతి చోట ఏదో ఒక కొత్త తలపోటు వస్తుండడం తో చినబాబు పర్యటనలకు పెదబాబు బ్రేకులు వేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube