పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత రెండు రోజులుగా మీడియాలో తెగ సందడి జరిగింది.రామ్ తాళ్లూరి బ్యానర్‌లో ఒక ప్రముఖ దర్శకుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో తెరకెక్కించబోతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
రాజకీయ నాయకుడిగా పవన్ కనిపించబోతున్నాడు, ఎన్నికలకు ముందు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతుందని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ కొట్టి పారేశాడు.

తాను సినిమాల్లో నటించబోతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని పవన్ క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం తాను మొత్తం టైంను రాజకీయాలకే కేటాయించినట్లుగా చెప్పుకొచ్చాడు.సినిమాలకు కేటాయించేంత సమయం నా వద్ద లేదని పవన్ పేర్కొన్నాడు.
సినిమాల్లో చేసే ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదు అంటూ చెప్పడంతో గత రెండు మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.పుకార్లే అయినా మెగా ఫ్యాన్స్ చాలా సంతోషించారు.
పవన్ మళ్లీ సినిమాలో అది కూడా మెగా హీరో మూవీలో కీక పాత్రలో అనడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు దూరం అయిన విషయం తెల్సిందే.ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.అజ్ఞాతవాసి సినిమా సక్సెస్ అయితే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని పవన్ చేయాలనుకున్నాడు.
కాని ఆ సినిమా పట్టాలెక్కలేదు.అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు.ఇది తాత్కాలిక గుడ్ బై ఆ లేకుంటే శాస్వత గుడ్ బై ఆ అనేది తేలాల్సి ఉంది.2019 ఎన్నికల్లో ఫలితాలను బట్టి పవన్ సినీ కెరీర్ ఆధారపడి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.







