ఎన్టీఆర్ కి అలా చెప్పి చెర్రీకి ఇలా చెప్పాడా ..? రాజమౌళి ఎంత పనిచేశాడు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ .మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ … దర్శక బాహుబలి రాజమౌళి ఈ ముగ్గురి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు హాట్ టాఫిక్ గా చర్చకు దారితీసింది.

 Rajamouli Master Plan For Rrr Movie With Cherri And Jr Ntr-TeluguStop.com

ఈ సినిమా కోసం తారక్ ను బాడీ పెంచమని సూచించిన రాజమౌళి .ఇదే సినిమాలో మరో హీరో పాత్రను పోషిస్తున్న రామ్ చరణ్‌ ఫిజికల్‌ ట్రాన్స్‌ ఫర్మేషన్‌ గురించి తీవ్ర మధన పడుతున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఈసినిమా కథ రీత్యా చరణ్ స్లిమ్ గా ఎప్పటిలాగే తన సహజమైన లుక్ తో కనిపిస్తే చాలు.అయితే ఈ సినిమాలో చెర్రీ లుక్ ను కూడా చాలా… డిఫరెంట్ గా చూపించాలి అన్న రాజమౌళి తపనతో చరణ్‌ హెయిర్‌ స్టయిల్‌ కోసం హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్‌ హకీమ్‌ తో చాల లోతైన చర్చలు రాజమౌళి చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ ను సరికొత్తగా చూపించబోతున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ – చెర్రీ ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారట.

న్యూ లుక్ లో తమ అభిమాన హీరోలు ఎలా ఉండబోతున్నారు… న్యూ లుక్ వారికి సెట్ అవుతుందా లేదా అనే టెన్షన్ వారిలో ఉంది.అయితే రాజమౌళి వంటి బడా డైరెక్టర్ల చేతిలో పడ్డాక ఖచ్చితంగా వారి క్రేజ్ అమాంతంపెరుగుతుందే తప్ప తగ్గదు అనేది నిజం.కాకపోతే ఇద్దరు టాప్ అండ్ యంగ్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది .? ఎవరి పాత్రకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది అనేది మాత్రం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube