ద్రౌపది వేశంలో శ్రియ.. ఎన్టీఆర్‌ లో స్టార్స్‌ ఇంకా ఎందరో!

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఎన్టీఆర్‌’.క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్‌ నటీనటులు కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

 Shrira Sharan In Ntr Biopic As A Droupadi-TeluguStop.com

బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటించగా ఇతర పాత్రల్లో రానా, కళ్యాణ్‌ రామ్‌, నిత్యామీనన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంకా పలువురు కనిపించబోతున్నారు.రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ జీవితాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌ల్లో ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రంపై ఎక్కువ ఆశక్తిని సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.తప్పకుండా ఈ చిత్రం మంచి కంటెంట్‌ ను కలిగి ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో ఎన్నో అద్బుతమైన సినిమాలు ఉన్నాయి.ఆ సినిమాలకు సంబంధించిన మేకింగ్‌ విశేషాలను కొన్నింటిని ఈ చిత్రంలో క్రిష్‌ చూపించబోతున్నాడు.అందులో భాగంగానే ఎన్టీఆర్‌ చేసిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ కూడా ఉండబోతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో శ్రియ కనిపించబోతుంది.

దాన వీర శూర కర్ణ చిత్రం షూటింగ్‌ సమయంలో ద్రౌపదిగా శ్రియ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.శ్రియ వరుసగా బాలయ్య చిత్రాల్లో నటిస్తూ వస్తుంది.తాజాగా ఈ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్‌ దక్కింది.ఇక దానవీర శూరకర్ణ చిత్రం షూటింగ్‌ లో కళ్యాణ్‌ రామ్‌ అర్జునుడిగా కనిపించబోతున్నాడు.అప్పట్లో హరికృష్ణ అర్జునుడి పాత్రలో నటించి మెప్పించాడు.ఇప్పుడు అర్జునుడి పాత్రను కళ్యాణ్‌ రామ్‌ పోషించబోతున్నాడు.

ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.మరి అది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

సంక్రాంతికి మొదటి పార్ట్‌, రెండవ పార్ట్‌ రిపబ్లిక్‌ డేకు విడుదల కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube