టీఆర్ఎస్ లో ఇంత కుట్ర జరుగుతోందా ...? హరీష్ రావు ఒంటరివాడేనా ..?

అసలు వాస్తవం మాట్లాడుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ పేరు చెబితే మొదట గుర్తుకు వచ్చే పేరు కల్వకుంటల చంద్రశేఖరరావు .రెండవ పేరు హరీష్ రావు.

 Secret Meeting About Harish Rao In Trs-TeluguStop.com

పార్టీ లో కేసీఆర్ తరువాత ఆ స్థాయిలో చక్రం తిప్పగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది హారీష్ రావు అనేది జగమెరిగిన సత్యం.అయితే అదంతా ఒకప్పుడు.

ఇప్పుడు అంతా సీన్ రివర్స్.ఇప్పడు టీఆర్ఎస్ లో నెంబర్ టూ ఎవరంటే కేటీఆర్ పేరు ప్రస్తావనకు వస్తోంది.పార్టీలోనూ… పదవుల్లోనూ … కేటీఆర్ దే హావ.ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్న పార్టీ మొత్తం బరువు బాధ్యతలను కేటీఆర్ తీసుకుని కేసీఆర్ తరువాత నేనే అనే నమ్మకం కలిగిస్తున్నది.అంతెందుకు ఒక్కమాటలో చెప్పాలంటే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అనే స్థాయిలో ఆయన పలుకుబడి పెంచేసుకున్నాడు.

ఇప్పుడు టీఆర్ఎస్ లో వారసత్వ పోరు నడుస్తోంది.మొదలైన వారసత్వ పోరులో హరీశ్ వెనకబడిపోయారనే టాక్ వినిపిస్తోంది.ఇప్పుడంతా కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ చెప్పిందే వేదం.

ఆఖరికి కేసీఆర్ సైతం కేటీఆర్ మాట వినాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి.అయితే.

ఈ రాజకీయ వారసత్వ పోరులో కేసీఆర్ కేటీఆర్ వైపే మొగ్గుచూపడంతో పరిస్థితులు మరింత వేగంగా మారిపోయాయనే టాక్ పార్టీవర్గాల్లో వినిపిస్తుంది.నిజానికి .2014 ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదట్లో మంత్రి హరీశ్ కనుసన్నల్లో సగానికి సగం ఎమ్మెల్యేలు ఉండేవారట.సరిగ్గా ఇక్కడి నుంచే కేసీఆర్ మైండ్‌గేమ్ మొదలు పెట్టినట్లు సమాచారం.

హరీశ్‌తో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేల పనులు కాకుండా చూడడం.పట్టించుకోకపోవడం.

వంటివి కేసీఆర్ స్వయంగా కావాలని చేసిన పనులేనట.

ఇక కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో ఈసారి కేసీఆర్ గెలవడం కష్టేమేనని, అందుకే ఆయన సిద్దిపేట నుంచి పోటీ చేస్తారని, గజ్వేల్ నుంచి హరీశ్‌ని బరిలోకి దింపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే.ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమేనని, గజ్వేల్‌లో అయితే.

హరీశ్ గెలుస్తాడనే మైండ్‌గేమ్‌కు కేసీఆర్ తెరలేపారని పలువురు టీఆర్ఎస్ నాయకులూ చర్చించుకుంటున్నారు.తాను గెలవలేని పరిస్థితులు ఉన్న చోట హరీశ్ ఎలా గెలుస్తాడో కేసీఆర్‌కే తెలియాలని, ఇదంతా హరీశ్‌ని పక్కన పెట్టేందుకు వేస్తున్న ఎత్తుగడగా కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.

టీఆర్ఎస్ నుంచి హారీష్ రావు ను పొమ్మనలేక పొగ పెట్టేందుకు కేసీఆర్ , కేటీఆర్ ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారు అని కొంతమంది హరీష్ వర్గం నాయకులు అధినేతపై గుర్రుగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube