'త‌ప్పు నా భార్య‌ది, శిక్ష అనుభ‌వించింది నేను' అంటూ ఓ భర్త పంపిన మెసేజ్ ఇది.! అతనికి మీ సలహా ఏంటి.?

నా పేరు ర‌వి., నేను సెటిల్ అయ్యి 2 సంవ‌త్స‌రాలు కావ‌డంతో ….

 Her Mistake Makes Me Punished-TeluguStop.com

అమ్మానాన్న‌లు నాకు పెళ్లి చేయాల‌ని సంబ‌ధాలు చూస్తున్నారు.మా నాన్న ఫ్రెండ్ కూతురు ఉండ‌డంతో పెళ్ళి చూపుల‌కు వెళ్లాము.! ఆ అమ్మాయి నాకు బాగా న‌చ్చింది.ఇరువైపుల అంద‌రికీ ఒకే అవ్వ‌డంతో పెళ్లికి ముహుర్తం పెట్టుకున్నాం.! పెళ్లికి ముందు నేను త‌న‌తో ఒక్క‌సారే మాట్లాడాను., త‌ను సైలెంట్ గా ఉండే స‌రికి సిగ్గు అన్నుకున్నాను.

పెద్ద‌గా ఒక‌రి అభిరుచులు ఇంకొక‌రికి తెలియ‌కుండానే పెద్ద‌ల ఆశీర్వాదాల‌తో మా పెళ్లి చాలా వైభంవంగా జరిగిపోయింది.మా ప‌స్ట్ నైట్ సంద‌ర్భంలో త‌న‌ని ఎవర్నైనా ప్రేమించావా అని అడిగేస‌రికి…”.

ఆ.అవును ఒక్క‌ప్పుడు చాలా ఇష్డ‌ప‌డ్డాను అత‌నిని., కానీ ఇప్పుడు కాదు”.అనే స‌రికి హ‌మ్మ‌య్యా .! అని ఊపిరి పీల్చుకున్నా.! ఎందుకంటే నాకు ఆ అమ్మాయి చాలా బాగా న‌చ్చింది.!

అప్ప‌టికి మా పెళ్ళి జ‌రిగి 2 నెల‌లు అవుతుంది.చిన్న‌ప్ప‌టి నుండి తెలిసిన వాళ్ళ‌మే అయినా…మా ఇంటికి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి త‌ను మ‌మ్మ‌ల్ని ఎప్పుడూ తెలియ‌ని వాళ్ళ‌ను చూస్తున్న‌న‌ట్లుగా ప్ర‌వ‌ర్తించేది.! త‌న‌ని ఇలా చూసి., ఎదైనా స‌మ‌స్య ఉంటే నాతో చెప్పు ఎందుకిలా ఉన్నావ‌ని త‌ర‌చుగా నేను అడుగుతూనే ఉండేవాడిని.! త‌న‌ని మేం ఎంతో బాగా చూసుకునే వాళ్ళం కానీ వాళ్ల త‌ల్లిదండ్రులు, స్నేహితుల‌తో… త‌న‌ను మేం స‌రిగ్గా చూసుకుట్లేద‌ని., అస్త‌మానం ఏదో ఒక‌టంటూ ఉన్నామ‌ని, నాకు అనుమానం ఎక్కువ‌ని, మా మీద అబ‌ద్దాలు చెప్పుది.

త‌న‌ను రాణిలాగా చూసుకుంటున్నా ఇలా ఎందుకు చెబుతుందో అర్థంకాక‌.నాకు చాలా కోపం వ‌చ్చేది.! ఇలోగా నాకు వేరే ఊరికి ట్రాన్ఫ‌ర్ అవ్వ‌డంతో అమ్మ వాళ్లను మాతో పాటు వ‌చ్చి కొన్ని రోజులు ఉండ‌మ‌ని అడిగాను.మేము అమ్మ‌వాళ్ల‌తో స‌హా కొత్త ఊరికి వెళ్లిపోయాం.

అక్క‌డికి వెళ్లాక తాను ఉద్యోగంలో చేరుతాన‌ని అడిగింది.పోనీలే బ‌య‌టికి వెళ్తే కొంత మార్పు ఉంటుంది క‌దా అని అలాగే అన్నాం…!

రోజులు .ఏదో ప‌ర్లేదు అన్న‌ట్టు గ‌డుత‌స్తున్నాయ్బా., బాగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తుండ‌డంతో…నాకు సంవ‌త్స‌రం పాటు U.S వేళ్లే అవ‌కాశం వ‌చ్చింది, కంపెనీ వాళ్లు ప్యామిలీని కూడా అకాంబిడేట్ చేస్త‌మన‌డంతో త‌న‌ను కూడా బ‌య‌లుదేర‌మ‌న్నాను .దానికి తాను నేను రాను నా ఉద్యోగం పోతుంది అంది.! ఈ మాటకు నాతో పాటు అందరం షాక్ అయ్యాం.! అదేంటి.

నాకన్నా నీకు ఆ ఉద్యోగం ముఖ్య‌మా .? అని అడిగేస‌రికి అవును అనింది.ఇక నాకు మాట్లాడ‌డానికి కూడా ఏ రీజ‌న్ క‌నిపించ‌లేదు.! మా నాన్న వాళ్ల నాన్నకు కాల్ చేసి మీ అమ్మాయేంటి? ఇలా ఉంటోంది అని అడిగారు.మామ‌గారు వ‌చ్చి త‌న‌ను బ‌తిలాడ‌డం మొద‌లు పెట్టారు.త‌న‌కు న‌చ్చ‌జెప్పి వెళ్లిపోయారు.రెండు రోజులు త‌ర్వాత మ‌ళ్లీ యాస్ ఇట్ ఈస్.! అస‌లేంటి ఇదంతా…? అని ఎంక్వైరీ చేసేస‌రికి త‌ను ప్రేమించిన పాత ల‌వ‌ర్ ఆ కంపెనీలో ప‌ని చేస్తున్న‌ట్టు., వాళ్లిద్ద‌రూ పాత ప‌రిచయంతో సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్టు తెలిసి నాగుండె మండిపోయింది.చాలా కోపంతో ఇంటికి వ‌చ్చి….త‌న‌ని ఇందంతా ఏంటి? అని అడిగేశా.త‌ను ఈ ఊరు వ‌చ్చాక‌.

ఆ అబ్బాయిని చూశాక పాత ప్రేమ మ‌ళ్లీ మొద‌లైంది.అత‌నే కావాలి అనిపిస్తుంద‌ని చెప్పింది.

నాకు ఒళ్లు మండిపోయింది.అయితే అత‌నితో వెళ్లి పో.ఎందకిలా మా అంద‌ర్ని హింస పెట్ట‌డం అని అన్నాను…దానికి తను లేదు…మా కుటుంబం ప‌రువు పోవడం నాకిష్టం లేదు అందుక‌నీ మీతోనే ఉంటాను, కానీ త‌న‌ను మ‌ర్చిపోనూ అని తెగించి చెబుతుంటే….చాలా అస‌హ్యం క‌లిగింది.

ఎంతో ఇష్ట‌ప‌డి త‌న‌ను పెళ్లి చేసుకుంటే నా జీవితం మీద‌ విర‌క్తి క‌లిగేలా చేసింది త‌ను .అమ్మానాన్న‌లైతే త‌మ వళ్లే నా జీవితం నాశ‌నం అయింద‌ని బాద‌ప‌డిని రోజంటూ లేదు.!

ఒకరోజూ బాగా ఆలోచించి అమ్మ‌నాన్న‌ల‌ను ఊరు వెళ్ల‌మ‌ని, నేను U.S వెళ్ల‌డానికి ఏర్పాటు చేసుకున్నాను.త‌న నాన్న‌తో మాట్లాడి, మీ అమ్మాయిని మీకు నచ్చిన‌ట్టు చేసుకోండ‌ని చెప్పేసి….విడాకుల‌కు అప్ల్ చేసి U.S వెళ్లాను.మ్యూచువ‌ల్ అండ‌స్టాండిగ్ మీద నాకు త్వ‌ర‌లోనే విడాకులు వ‌చ్చేశాయి….

అక్క‌డితో నా జీవితంలో ఓ పెద్ద డ్రామాకు తెర‌ప‌డింది.ఇదంతా అయ్యేస‌రికి నా వ‌య‌స్సు 29 సంవ‌త్ప‌రాలు మాత్ర‌మే.! U.S లో నా జీవితం హ్యాపీగా గ‌డిచిపోతుంది.కానీ మ‌ళ్లీ మ‌రో అమ్మాయిని నా జీవితంలోకి అహ్వానించ‌డానికి ధైర్యం స‌రిపోక‌…ఇప్ప‌టికీ సింగిల్ గానే ఉండిపోయాను.! చాలా సంబంధాలు వ‌స్తున్నాయి.! ఏ సంబంధానికి O.K చెప్పాలో అర్థమవ్వ‌డం లేదు.అస‌లు ఏం చూసి పెళ్లికి ఓప్పుకోవాలి- ఈ విష‌యంలో నాకు కాస్త మీ స‌ల‌హాలు ఇవ్వండి.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube