48 గంటల మారథన్‌ : అరుదైన రికార్డు కోసం ‘సర్కార్‌’ విశ్వ ప్రయత్నం

తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సర్కార్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 6వ తేదీన విడుదల కాబోతుంది.

 Kollywood Training 48 Hours Marathon For Sarkar Movie-TeluguStop.com

తమిళ స్టార్‌ హీరో విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్‌’ చిత్రంను ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా విడుదల చేసి రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు.

కేరళలో విజయ్‌కి భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.ఆ ఫాలోయింగ్‌ నేపథ్యంలో అక్కడ ఒక థియేటర్‌లో 24 గంటల షోలకు అనుమతి దక్కింది.

కేరళలో 24 గంటల పాటు ఒక థియేటర్‌లో ఏకథాటిగా మారథాన్‌ సాగినట్లుగా సర్కార్‌ మూవీ షోలు ఒకదాని తర్వాత మరోటి సాగుతూనే ఉంటాయి.షోకు షోకు మద్య పావు గంటల లేదా 20 నిమిషాల చొప్పున బ్రేక్‌ ఇచ్చి బ్యాక్‌ టు బ్యాక్‌ షోలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.కేరళలోనే అంతటి రికార్డుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో చెన్నైలో ఎందుకు ప్రయత్నించకూడదు అనుకుంటున్నారు.

‘సర్కార్‌’ మూవీని చెన్నైలోని ఒక థియేటర్‌లో ఏకధాటిగా 48 గంటల మారథాన్‌ షోలను వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.సర్కార్‌ నిర్మాతలు అయిన సన్‌ నెట్వర్క్‌ వారు ఈ చిత్రం కోసం ప్రభుత్వం వద్ద అనుమతులను అడుగుతోంది.48 గంటల మారథాన్‌ షోలకు అనుమతి వస్తే రికార్డుగా చెప్పుకోవచ్చు.

ఈ అరుదైన రికార్డును విజయ్‌ దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది.ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం 48 గంటల మారథాన్‌ షోలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం గతంలో కూడా సన్‌ నెట్వర్క్‌కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంది.అందుకే ఇప్పుడు 48 గంటల మారథాన్‌ షోలకు కూడా ఓకే చెప్పే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.

అదే జరిగితే విజయ్‌ ఖాతాలో అరుదైన రికార్డు పడ్డట్లే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube