ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, నాకన్నా సీనియర్ ఎవరూ లేరు.ప్రదాని నరేంద్ర మోడీ కన్నా కూడా ముందుగా నేను 1995లో సీఎం అయ్యాను.
నేనే ఈ దేశంలో సీనియర్‌ను.నన్ను మించిన మొనగాడు లేరు! – ఇదీ రెండు రోజుల కిందట ఢిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన గంభీరమైన ప్రకటన.
అదేసమ యంలో ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలపైనా మాట్లాడారు.జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిని ఆయన పార్టీ ఆయనపై హత్యా యత్నం చేసి, నాటకాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.
కత్తిదాడి ఎందుకు జరిగిందో కేంద్రమే సమాధానం చెప్పాలని నిలదీశారు.అంతేకాదు, జగన్‌పై జగనే తన అభిమానితో పక్కా వ్యూహంతో దాడి చేయించుకున్నారని మీడియాతో అన్నారు.
అయితే, నేడు సాధారణ మీడియా కంటే పవర్ ఫుల్ గా మారిపోయిన సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.ముఖ్యంగా తనకు అపార అనుభవం ఉందని చెబుతున్న బాబుపై నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.
నాలిక గీసుకునేందుకా బాబూ నీ అనుభవం? అంటూ ఘాటుగానే ప్రశ్నిస్తున్నా రు.ఈ నలభై ఏళ్ల అనుభవం.నాలుగేళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ ముందు విలవిలలాడుతోందని, ఈ విషయాన్ని నేరుగా పార్లమెంటులోనే దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ నిస్సిగ్గుగా నీ వలువలు ఊడ్చినప్పుడు ఏమైందని ప్రశ్ని స్తున్నారు.ప్రత్యేక హోదా వద్దన్న నోటితోనే కావాలని అన్నావు.
హోదా అడిగితే.బొక్కలో పెడతా.అన్న నోటితోనే రోడ్డెక్కి ధర్మపోరాట నాటకాలకు తెరదీశావు!

ఇక, ఇప్పుడు ఏపీ ఐటీ రాజధాని అని పదే పదే వల్లించే విశాఖ విమానాశ్రాయంలో పట్టపగలు.అధికారులు, సిబ్బంది భద్రతగా ఉన్నప్పుడే.విపక్ష నేతపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడంటే.దీనికి కేంద్రం సమాధానం చెప్పాలా? లేక ఏపీ సీఎంగా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న మంత్రిగా మీ నాయకులు సమాధానం చెప్పాలా? విశాఖ ఎయిర్ పోర్టు లో లోపలి భాగం తమకు సంబంధం లేదని చెబుతున్న చంద్రబాబు.గతంలో జగన్ ఆందోళన చేసినప్పుడు ప్రత్యేక హోదా పై గళం విప్పుతానని అన్నప్పుడు .మీరు ఎయిర్ పోర్టులోకి మీ పోలీసులను పంపి జగన్‌ను అడుగు బయటకు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారు? ఇక, కట్టిపెట్టండి.,.మీ అనుభవ పాఠాలు!

మీ అనుభవం .మీ కుమారుడిని మంత్రిని చేసుకునేందుకు, మీ ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్రాన్ని దోచుకునేందుకు కాల్ మనీ బిజినెస్‌లతో కోట్లకు కోట్లు పడగలు ఎత్తేందుకు మాత్రమే ఉపయోగపడింది.ఏ అనుభవం లేకుండానే మంత్రి అయిన మీ పుత్ర రత్నానికి ఉన్న కొద్దిపాటి ఆలోచన కూడా మీకు లేకపోయింది.
పాపం.లోకేష్ రాజకీయాల్లో చాలా ఎదగాల్సిన నాయకుడు.
జగన్‌పై దాడి జరిగిన వెంటనే ఖండించాడు.ఇలాంటి వాటికి సమాజంలో చోటు లేదన్నాడు.
(అయితే, ఆ తర్వాత తన తండ్రి, సీఎం చంద్రబాబు చేసిన యూటర్న్ ప్రకటనతో ఆయన కూడా మారిపోయాడు) కనీసం మీరు ఈ మాత్రం కూడా జాలి చూపించలేక పోయారు.మీ ప్రతినిధిగా ఇప్పటి వరకు కూడా జగన్ చెంతకు ఎవరినీ పంపలేదు.
ఇదా.మీ అనుభవం బాబూ.అయితే, ఇక వద్దులే!! విశ్రాంతి తీసుకుందురు గానీ అంటున్నారు.