‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి ఆ తర్వాత చాలా కాలం విరామం తీసుకున్నాడు.త్వరలో ఇద్దరు స్టార్ హీరోలతో ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.
చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న ఆర్ మల్టీస్టారర్ ప్రీ ప్రొడక్షన్ పనులు తాజాగా పూర్తయ్యాయి.ఇక సెట్స్ మీదకు వెళ్లేందుకు చిత్ర యూనిట్ అంతా కూడా రెడీ అవుతున్నారు.
ఈ చిత్రాన్ని 300కోట్లతో డివివి దానయ్య నిర్మిస్తుండగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటించనున్నారు.ఈ చిత్ర ప్రారంభానికి తాజాగా ముహుర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
నవంబర్ మొదటి వారంలో ప్రారంభోత్సవాన్ని చేసి ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టాలని చిత్ర యూనిట్ ఇప్పటికే సన్నాహాలు షురూ చేశారు.ఈ చిత్రాన్ని 2020కల్లా పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ఇప్పటి నుండే చకాచకా చిత్రీకరణ జరపడానికి రెడీగా ఉన్నారు.అందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కూడా బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఆర్ మల్టీస్టారర్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు చాలా ప్రాజెక్ట్‌లను పక్కన పెట్టినట్టు వారి సన్నిహితులు చెబుతున్నారు.
షూటింగ్లో మొదటి షెడ్యూల్లో ఇంటర్వెల్ సీన్‌ని తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నాడు.అందుకు 45రోజుల ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.కేవలం 10 నిమిషాలు ఉండే ఇంటర్వెల్ సీన్‌ని 45రోజులు తెరకెక్కించబోతున్నారు అనడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.ఇంటర్వెల్ సీన్‌ను ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తే ఇక సినిమా అంత ఎలా ఉండబోతుంది అనే అంచనాలు ఇప్పటి నుండే నెలకొంటున్నాయి.
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.అందులో ఒక ఫారిన్ భామ కూడా ఉంది.