'అందుకోసం 12 ఏళ్ల వయసులోనే స్టెరాయిడ్స్ వాడా..! తర్వాత మా అమ్మ?' యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్.!

సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి సరైన ఛాన్సులు రాక బుల్లితెరవైపు వచ్చినవారెందరో.వారిలో ఒకరే రష్మి.

 Anchor Rashmi Gautam Agrees Taking Steroids-TeluguStop.com

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా దూసుకుపోతున్న రష్మి.ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.

చిన్న చిన్న పాత్రలు చేసి సరైన అవకాశాలు రాక జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.యాంకరింగ్ కి గ్లామర్ సొగసులద్దిన వారిలో అనసూయ,రష్మి ముందుంటారు.

రష్మి ఏం చేసినా,ఏం మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటుంది.

తాజాగా అభిమాని చేసిన రిక్వెస్ట్‌పై రష్మీ స్పందించారు.

తన బరువు, లావుకు కారణమైన పరిస్థితులను రష్మీ వివరించారు.లావైతే నాకు ఆఫర్లు తగ్గిపోతాయి.

మీరు సూచించిన ప్రకారం నా ఆహార అలవాట్లు, తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్త వహిస్తాను అని చెప్పారు.అంతేకాకుండా తన లావుకు కారణం రుమాటిజం.

ఈ వ్యాధికి గురయ్యానని 12వ ఏటనే తెలిసింది.అప్పటి నుంచి నేను ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాను అని రష్మీ వెల్లడించారు.

ఈ వ్యాధి వల్ల బరువు, లావు విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.దానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకొంటున్నాను.

అభిమానులు ఆందోళన చెందవద్దు అని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటె.శిరీష అనే యువతి రష్మికి ట్వీట్ చేస్తూ ”రుమటాయిడ్‌ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందో లేదో తెలియదు కానీ… నా భర్త నాలుగేళ్లుగా రుమటాయిడ్స్‌తో బాధపడుతున్నారు.ట్రీట్మెంట్ నిమిత్తం ఎక్కడికి వెళ్లాలో తెలీడం లేదు.

ఒకప్పుడు మీరూ రుమటాయిడ్‌తో బాధపడిన వారే కదా.మీరేదన్నా ఐడియా ఇవ్వగలరా? అని అడిగింది.

వెంటనే రష్మి స్పందిస్తూ.ఇందుకు ప్రత్యేక ట్రీట్మెంట్ అంటూ లేదని.మన లైఫ్ స్టైయిల్‌లో కొన్ని మార్పులు చేసుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి వుంటుందని చెప్పింది.అంతేగాకుండా, ఆయుర్వేద మందులు వాడితే మంచి ఫలితం వుంటుందని తెలిపింది.ఇటీవల తనకు ఆటో ఇమ్యూన్‌ సమస్యలు ఎదురైనప్పుడు స్టెరాయిడ్లు తీసుకున్నానని చెప్పింది.చిన్నప్పటి నుంచే రుమటాయిడ్స్ నుంచి ఉపశమనం కోసం బాగా నొప్పి కలిగించే స్టెరాయిడ్స్ తీసుకున్నా.

ఆ తర్వాత అమ్మ చెప్పిన చిట్కాలను పాటిస్తున్నా.ఆహారం, వ్యాయామమే ఇందుకు మంచి ఔషధం అని చెప్పింది.

ఇంకా ఒత్తిడిని దూరం చేసుకోవాల్సి వుంటుందని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube