రాష్ట్రంలో మరోమారు ఐటీ దాడుల కలకలం రేగింది.ఇప్పటికే ఏపీలోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
రేపు విశాఖపట్టణంలో ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.విశాఖలోని పారిశ్రామికవేత్తలు, టీడీపీకి చెందిన కీలక నేతలు, చిట్ ఫండ్ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఈ సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే విశాఖ పట్టణానికి నాలుగు రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు భారీగా చేరుకున్నట్లు సమాచారం.దాదాపు 50 మంది అధికారులు వివిధ మార్గాల ద్వారా ఒడిశా, తెలంగాణ, చెన్నై, బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు