ఏపీలో టీడీపీకి అధికారం దక్కకుండా చెయ్యడం కోసం నేను ఎవరితో అయినా పోతూ పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను… జగన్ నాకు శత్రువు కాదు అంటూ గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నాడు.ఇక వైసీపీ వ్యవహారం చూస్తే పవన్ విషయంలో ఆచి ధ్చి స్పందిస్తున్నారు.
మొన్నటి వరకు పవన్ మీద విమర్శలు చేయలేదు.కారణం జనసేన వైసీపీ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయని, సీట్ల సర్దుబాటై ఒక కొలిక్కి రావడంలేదు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి.
అయితే ఈ రెండు పార్టీలు ఆ విషయం పై నోరు మెదపలేదు.కానీ అనూహ్యంగా నిన్నటి నుంచి పవన్ పై వైసీపీ విరుచుకుపడుతోంది.
దీనికి వెనుక ఒక కారణం అయితే ఉంది.

పొత్తుల దాకా వెళ్తుందన్న దశలో ఈ రెండు పార్టీల మధ్య ఈ గ్యాప్ ఎందుకొచ్చందనేది చాలా మందికి అర్థం కావడం లేదు.దానికి కారణం ఒకటే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.అదేమిటంటే.
ధవళేశ్వరం కవాతు సభలో పవన్ కల్యాణ్.తనను “సీఎం .సీఎం.” అని పిలవమని.పదే పదే ఫ్యాన్స్‌ను కోరారు.అలా పిలిపిచుకుని సంతృప్తి పడ్డారు.ఇదే జగన్‌కు నచ్చలేదట.పొత్తులు పెట్టుకున్నా తానే సీఎం అని.పవన్ కల్యాణ్ ఎలా పిలిపించుకుంటారనేది జగన్ వాదన.పవన్ తీరు చూస్తూంటే వేరే ఏదో ప్లాన్‌లో ఉన్నట్లు ఉన్నారన్న అనుమానాలు జగన్ కలుగుతున్నాయి.
దీనిలో భాగంగానే ఇప్పుడు పవన్ పై విమర్శలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కనుక ఉంటే 20 – 25 సెట్లు పవన్ కి ఇచ్చేసి జగన్ సీఎం అవ్వాలని చూస్తున్న తరుణంలో పవన్ ఇలా అకస్మాత్తు గా తన కలల కుర్చీ కి ఎసరు పెట్టాలనుకోవడం జగన్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని సమాచారం.అయినా పొత్తు చర్చలు ఇంకా పూర్తవల్లేదు.ఇంతలోనే ఇలా ఏకపక్షంగా సీఎం పదవి మీద కన్నేసి అభిమానులతో పిలిపించుకోవడం ఏంటి.? అని జగన్ తన సన్నిహితుల దగ్గర వాఖ్యానించారట.అందుకే ఇంత అకస్మాత్తుగా పవన్ సామాజికవర్గానికి చెందిన వైసీపీ ఏలూరు సమన్వయకర్త .జిల్లా పార్టీ ఇంచార్జి ఆళ్ళ నాని తో పవన్ పై జగన్ విమర్శలు చేయించింది.