తెలంగాణాలో అసలైన ఎన్నికల సందడి మొదలవబోతుంది.మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ గురించి స్పష్టత ఇచ్చింది.డిసెంబర్ 7 న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
డిసెంబర్ 11 న ఫలితాలు వెల్లడించనున్నారు.తెలంగాణలో నామినేషన్లు నవంబర్ 12 నుంచి 19 వరకు స్వీకరించనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 22 చివరి తేదీ.అంటే మొత్తానికి 2 నెలల్లో ఎన్నికల తంతు ముగుస్తుంది.
తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారనే అనుమానాలు ఉన్నాయి.కేసు ఓటర్ల జాబితాకు సంబంధించింది మాత్రమే.ఓటర్ల జాబితాను సరిచేయడానికి తగినంత సమయం ఉంది.ఓటర్ల జాబితాకు సంబంధించి కోర్టుకు అన్ని వివరాలనూ నివేదిస్తాం అని ఆయన పేర్కొన్నారు .