కిడారి కొడుక్కి మంత్రి పదవి ..? ఇదో రాజకీయమా ..?

సెంటిమెంట్ రాజకీయాలు ఎలా పండించాలో మన రాజకీయ నాయకులకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు .ప్రతి అంశం రాజకీయంగా వాడుకునేందుకు వారు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు.

 Kidaris Son Minister Post Offer Is It Politics-TeluguStop.com

ఇక శవ రాజకీయాలకు అయితే అంతే ఉండదు.విశాఖ జిల్లాలో పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీ అక్కడ సెంటిమెంట్ పండించి ఓట్లుగా మలుచుకునేందుకు సిద్ధం అయ్యింది.

ఇటీవల నక్సల్స్ దాడిలో మృతి చెందిన అరకు ఎమ్యెల్యే మరణాన్ని వాడుకునేందుకు ఇప్పుడు సిద్ధం అయ్యింది.

ఎమ్యెల్యే కిడారి సర్వేశ్వరరావు మరణంతో పెద్ద కుమారుడు శ్రావణ్ ని మంత్రిని చేస్తారని ప్రచారం నడుస్తోంది.ఇంజనీరింగ్ చదివిన కిడారి శ్రావణ్ ని రేపటి విస్తరణలో మంత్రిని చేసి గిరిజనుల సానుభూతి కొట్టేయాలని టీడీపీ ఆలోచన.ఏ సభలో సభ్యుడు కాకపోయినా మంత్రి కావచ్చు.

ఆరునెలల్లో ఎన్నికల్లో గెలిచి ఆ పదవి కాపాడుకోవచ్చు.ఈ రాజ్యాంగ నిబంధనను అనుసరించి కిడారిని ఈ నెలలో జరిగే విస్తరణలో మంత్రిని చేస్తారట.

ఏపీలో ఎస్టీలకు ఇప్పటివరకూ మంత్రి పదవి లేదు.ఆ లోటును భర్తీ చేయడంతో పాటు కిడారి కుటుంబానికి ఇవ్వడం ద్వారా సానుభూతిని కొట్టేయవచ్చు అని టీడీపీ భావిస్తోందట.

ఆరు నెలలు అయ్యేటప్పటికి ఎన్నికలు ఎలాగూ వస్తాయి కదా అనే కోణంలో టీడీపీ ఆలోచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube