ఒకపక్క తెలంగాణలో టీడీపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి.ఆ రెండు పార్టీల నాయకులు భుజ భుజాలు రాసుకుని తిరుగుతున్నారు.
అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోతోంది.తాజాగా ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు ప్రారంభించారు.
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, అంతకు ముందు ఎంపీ కెవీపీ రామచంద్రరావు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.కానీ రాహుల్ గాంధీ మాత్రం.
తాజా కర్నూలు పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఈగ వాలనీయలేదు.ఓ చోట స్నేహం.
మరో చోట శతృత్వం సాధ్యమవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! ఇది రాజకీయంగా తమను భారీగా దెబ్బతీసే అవకాశం ఉందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్న కాంగ్రెస్.టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోయింది.ఇరు పార్టీల నేతలు కలసి ప్రచారం చేయటమే కాదు.
హామీల అమలు కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక కూడా ప్రకటించేందుకు రెడీ అయిపోయారు.కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు రెడీ కావటాన్ని తొలుత టీడీపీ సీనియర్ నేతలు కె ఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వారు తీవ్రంగా తప్పుపట్టారు.
చివరకు తెలంగాణ వరకూ అయితే ఓకే అన్నారు.ఏపీలో మాత్రం సాధ్యంకాదని తెగేసి చెప్పారు.
అయితే ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచటం కూడా వ్యూహాత్మకమేనా? అన్న చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై నిర్మించిన టీడీపీ.అదే పార్టీతో జత కడుతుందని ఎవ్వరూ ఊహించలేదు.కానీ రాజకీయ అవసరాల రీత్యా చేతులు కలపాల్సి వచ్చింది.
ఇదే సమయంలో ఏపీలో మాత్రం ఈరెండు పార్టీలు విరోధులుగా ఉండటం విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ప్రస్తుతం ఈ రెండు పార్టీల పొత్తు, ఏపీ సీఎం చంద్రబాబుపై అటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్.
ఇతర ముఖ్య నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.అయినా చంద్రబాబు ఇవేమి పట్టించుకునే స్థితిలో లేదు.
ఎందుకంటే తెలంగాణాలో టీడీపీ బతకాలి అంటే కాంగ్రెస్ పొత్తు అవసరం.అదే సమయంలో ఏపీలో టీడీపీ గెలవాలంటే.
కాంగ్రెస్ శత్రువుగా ఉండి వైసీపీ ఖాతాలో పడే ఓట్లను చీల్చాలి.ఇదే బాబు మదిలో ఉన్న రెండు కళ్ళ సిద్ధాంతం.