జగన్ కి 21 ఎంపీ సీట్లు..రిపబ్లిక్ టివి షాకింగ్ సర్వే..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సర్వేల రిజల్స్ పార్టీలలో కాకరేపుతుంది.ఇప్పటి పరిస్థితుల బట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలో వస్తుంది.

 Republic Tv Sensational Survey Report On Ys Jagan-TeluguStop.com

ఎన్ని సీట్లు గెలుస్తాయి.చిత్తూ చిత్తుగా ఓడిపోయే పార్టీలకి ఎన్ని సీట్లు ప్రజలు కట్టబెడుతారు అనే కోణంలో పార్టీల గెలుపులపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇండియాలోనే ప్రజా నాడిని ఒడిసిపట్టగలిగే సర్వేలు చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నవాటిలో టాప్ సర్వే సంస్థ “సి ఓటర్, రిపబ్లిక్ టివి”లు

ఈ రెండు సర్వే సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వేలో ఏపీలో ఓటరు నాడు ఎలా ఉంది ఏ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి అనే కోణంలో సర్వే నిర్వహించిందట అయితే ఈ సర్వేలో వైసిపికి 21 లోక్ సభ సీట్లొస్తాయని స్పష్టమైంది.తెలుగుదేశంపార్టీకి మిగిలిన 4 సీట్లు దక్కుతాయని తేలిందట అంతేకాదు ఏపీలో ఓటర్లు వైసిపికి 41.9 శాతం ఓట్లతో స్పష్టమైన మొగ్గు చూపిస్తున్నారు.చంద్రబాబు వైపు 31.4 ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వే తేల్చింది.

అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ ప్రేమేయం కూడా లేకుండానే వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది ఈ సర్వే

ఏపీలో బిజెపికి 12.5 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 7.2 శాతం మంది ఓటర్ల మద్దతి ఇచ్చారు.జనసేన, సిపిఐ.సిపిఎం కూటమికి 7 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే కుండబద్దలు కొట్టింది.

అయితే చంద్రబాబు ని ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారట అందుకు గల కారణాలని సైతం ఈ సర్వే తెలిపింది.అయితే ప్రధాన కారణం నిరుద్యోగమని చెప్పారట సర్వేలో పాల్గొన్న ప్రజలు.ఆమధ్య ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలని అనుకుంటున్నారు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో 43 శాతం ప్రజలు జగన్ సీఎం అవ్వాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.అయితే ప్రజా నాది ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి ఈ సర్వేలు ఇప్పటి పరిస్థితులకి మాత్రమే పరిమితమయ్యి ఉంటాయి తప్ప ఇదే తుది తీరుపు కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube