మొన్నటి వరకు వైసీపీ అధినేత పవన్ – జగన్ ఇద్దరూ ఒకరిని తిట్టేసుకున్నారు.జగన్ ఒకడుగు ముందుకు వేసి పవన్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి మరీ విమర్శలు గుప్పించాడు.
అయితే అదంతా గతం.ఇప్పడు పాత విషయాలను గుర్తు చేసుకుని గిల్లికజ్జాలు పెట్టుకునే పనిలో జగన్ కానీ పవన్ కానీ లేరు.వారి ఇద్దరి లక్ష్యం టీడీపీ ని ఓడించడమే.టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడానికి తాను ఏమి చెయ్యడానికైనా సిద్ధం అని పవన్ బహిరంగం గా ప్రకటిస్తున్నాడు.
సరిగ్గా ఈ మాటలే అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

తాను ఒంటరిగా పోటీ చేస్తే.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి…టిడిపికి లాభిస్తుందన్న భావనతో ఉన్న ఆయన వైసీపీ అధినేత జగన్ తో పొత్తుల కోసం ఆరాటపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది.ఎట్టి పరిస్థితుల్లో ‘చంద్రబాబు’ను ఓడించాలనే ధ్యేయంతో ఉన్న బిజెపి అధిష్టానం జగన్ పవన్ లను కలపడానికి రంగం సిద్దం చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ ,జనసేన ,బిజెపి పార్టీలు బహిరంగంగా కలసి పోటీ చేయకపోయినా…అంతర్గతంగా కుమ్మక్కు అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
బిజెపి’తో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఇప్పటికే ‘జగన్’ కొన్ని సీట్లలో తన పార్టీ తరుపున బలహీనమైన అభ్యర్థులను నియమిస్తున్నారు.గుంటూరు-2 నియోజకవర్గమే దానికి నిదర్శనం కాగా.మరి కొన్ని చోట్ల బిజెపి కోసం ఇటువంటి కుమ్మక్కు అభ్యర్థులను రంగంలోకి దించడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
బిజెపి విషయం తేలిన తరువాత.పవన్ విషయంపై జగన్ దృష్టిసారిస్తారని తెలుస్తోంది.
అయితే పవన్ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి జగన్ అంగీకరించడం లేదట.

సింగిల్ డిజిట్‌లో అయితేనే సీట్లు ఇస్తానని.అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని ఆయన చెబుతున్నారట.కానీ…’పవన్’ మాత్రం తనకు కనీసం 25 ఎమ్మెల్యే నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారట.సీట్ల విషయంలో ఒక క్లారిటీ రాగానే జనసేన – వైసీపీలు టీడీపీ ఓటమే లక్ష్యంగా తమ రెండు పార్టీలు కలిశాయని ప్రజలకు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు.







