మహిళకు పదే పదే ఫోన్ చేసి అసభ్య కరమైన పదజాలం ప్రయోగించిన ఓ యువకుడిని ప్రజలు చెప్పులతో కొట్టారు.తన ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి అసభ్య కరమైన మాటలతో వేధిస్తుండడంతో తట్టుకోలేని మహిళ కుటుంబ సభ్యులకు తెలిపింది.
పక్కా ప్రణాళిక ప్రకారం యువతితోనే సదరు యువకుడికి ఫోన్ చేయించి పిలిపించారు.నిజమేననుకుని వచ్చిన యువకుడిని పట్టు కుని చెప్పులతో చితకబాదారు.
అసలు ఈ నెంబరు ఎలా లభించిందని ఆరా తీస్తే టాయ్‌లెట్ గోడపై ఉందని అందుకే కాల్ చేశానని తనను క్షమించాలని యువకుడు వేడుకోవడం కొసమెరుపు.ఇక మరో ఘటనలో క్యాబ్ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు ప్రయాణికురాలి సెల్‌నంబర్‌ను పబ్లిక్ టాయ్‌లెట్ గోడపై రాసి వేధింపులకు కారణమైయ్యాడు ఓ క్యాబ్ డ్రైవర్.ఓ మహిళ కోకాపేట్ నుంచి మాదాపూర్‌కు క్యాబ్ బుక్ చేసిన సమయంలో ప్రయాణ చార్జీ రూ.200 చూపించగా డ్రైవర్ ఇతర మార్గాల్లో తిప్పి రూ.800 చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అందుకు అంగీకరించని ఆమె రూ.200 మాత్రమే ఇచ్చింది.దీనిని మనస్సులో పెట్టుకున్న డ్రైవర్ ఆమె సెల్‌ఫోన్ నంబర్‌ను పబ్లిక్‌టాయ్‌లెట్ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి.

దీంతో బాధితురాలు పోలీసుకు కంప్లైంట్ ఇవ్వగా అసలు విషయం బయటపడింది.ఇక మరో సంఘటనలో కరాటే శిక్షణ కోసం వెళ్లిన తన కుమార్తెకు మాస్టర్ అశ్లీల దృశ్యాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వాట్సాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షీ బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి.సామాజిక మాధ్యమాల ద్వారా 64 ఫిర్యాదులు అందగా 47 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
మహిళకు పదే పదే ఫోన్ చేసి అసభ్య కరమైన పదజాలం ప్రయోగించిన ఓ యువకుడిని ప్రజలు చెప్పులతో కొట్టారు.
తన ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి అసభ్య కరమైన మాటలతో వేధిస్తుండడంతో తట్టుకోలేని మహిళ కుటుంబ సభ్యులకు తెలిపింది.పక్కా ప్రణాళిక ప్రకారం యువతితోనే సదరు యువకుడికి ఫోన్ చేయించి పిలిపించారు.
నిజమేననుకుని వచ్చిన యువకుడిని పట్టు కుని చెప్పులతో చితకబాదారు.

అసలు ఈ నెంబరు ఎలా లభించిందని ఆరా తీస్తే టాయ్‌లెట్ గోడపై ఉందని అందుకే కాల్ చేశానని తనను క్షమించాలని యువకుడు వేడుకోవడం కొసమెరుపు.ఇక మరో ఘటనలో క్యాబ్ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు ప్రయాణికురాలి సెల్‌నంబర్‌ను పబ్లిక్ టాయ్‌లెట్ గోడపై రాసి వేధింపులకు కారణమైయ్యాడు ఓ క్యాబ్ డ్రైవర్.ఓ మహిళ కోకాపేట్ నుంచి మాదాపూర్‌కు క్యాబ్ బుక్ చేసిన సమయంలో ప్రయాణ చార్జీ రూ.200 చూపించగా డ్రైవర్ ఇతర మార్గాల్లో తిప్పి రూ.800 చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అందుకు అంగీకరించని ఆమె రూ.200 మాత్రమే ఇచ్చింది.దీనిని మనస్సులో పెట్టుకున్న డ్రైవర్ ఆమె సెల్‌ఫోన్ నంబర్‌ను పబ్లిక్‌టాయ్‌లెట్ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి.
దీంతో బాధితురాలు పోలీసుకు కంప్లైంట్ ఇవ్వగా అసలు విషయం బయటపడింది.
ఇక మరో సంఘటనలో కరాటే శిక్షణ కోసం వెళ్లిన తన కుమార్తెకు మాస్టర్ అశ్లీల దృశ్యాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వాట్సాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షీ బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి.సామాజిక మాధ్యమాల ద్వారా 64 ఫిర్యాదులు అందగా 47 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.