బీజేపీ గెలుపు కోసం జగన్ భారీ త్యాగం..

వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా సరే సీఎం కుర్చీ అలంకరించాలని ఉవ్విళ్ళూరుతున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా భారీ వ్యూహాలకి సిద్దమవుతున్నాడని ఎవరూ ఊహించని విధంగా సరికొత్త రాజకీయాలకి తెరతీస్తున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది….తనపై ఉన్న కేసుల నుంచీ ఎలాగైనా సరే తప్పించుకోవాలని బీజేపీ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న జగన్ ఏపీలో బీజేపీ గెలుపు కోసం ఏ పార్టీ అధినేత చేయని త్యాగాన్ని చేస్తున్నాడట.ఇంతకీ ఏమిటా త్యాగం అనుకుంటున్నారా వివరాలలోకి వెళ్తే…

 Ys Jagan Secretly Helping To Bjp For Constituency In Ap-TeluguStop.com

ఏపీలో ఎన్నికల సమయంలో కొందరు బీజేపీ నేతలు పోటీ చేసే ప్రాంతాల్లో బలహీన నేతలను నిలపాలన్న బీజేపీ డిమాండ్ కి తప్పక తలొగ్గి మరీ ఈ డిమాండ్ కి ఒప్పుకున్నాడని రాజకీయ వర్గాలలో జోరుగా వార్తలు విన్పిస్తున్నాయి.అందుకే జగన్‌ ఆకస్మికంగా ఇన్‌చార్జులను మారుస్తున్నారని, ఆ మార్పిడి వల్లనే నాలుగేళ్లుగా ఇంచార్జిలు గా ఉన్నా వారిని ఏదొక కారణంతో తీసేస్తున్నారని, అందువల్లనే వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయని తెలుస్తోంది.అయితే రాష్ట్రంలో బీజేపీ వైసీపీల మధ్య అంతర్గతంగా పొత్తు ఉందన్న మాటా అందరికి తెలుసు అయితే తనని తానూ కాపాడుకోవడానికి , బీజేపీలోని ప్రముఖ నాయకుల గెలుపు కోసం తనను నమ్ముకున్న నేతలను త్యాగం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఒప్పందంలో భాగంగా దాదాపు 15 చోట్ల లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే కొన్ని స్థానాల్లో బలమైన నాయకులను తప్పించి, బలహీన నేతలను ఇన్‌చార్జులుగా నియమిస్తున్నారన్న ఆరోపణలకు నిలువెత్తు సాక్ష్యం తాగాజా వైసీపీలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని అంటున్నారు.నాలుగేళ్లుగా గుంటూరు-2 స్థానంలో వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న బలమైన నాయకుడు లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి ఇటీవలే పార్టీలో చేరిన ఏసురత్నానికి ఆ బాధ్యతలు అసలు ఏసు రత్నం ఎవరో కూడా తెలియదు అక్కడి ప్రజలకి అయితే ఈ మార్పు ఎందుకు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోసమేనని తెలుస్తోంది…అయితే ఇదొక్కటే కాదు.

సుమారు పది శాసనసభ, మూడు నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి వైసీపీ సహకరించేలా అంతర్గత ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం అసెంబ్లీ సీట్లలో మాత్రమే కాదు ఎంపీ స్థానాల్లో సిట్టింగ్‌లతోపాటు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు ఉంటారని చెబుతున్నారు.ఆ ఇద్దరూ కన్నాతో కలిసి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం.చిలకలూరి పేటలో విడుదలకి భాద్యతలు అప్పగించడం తో పత్తిపాటి పుల్లారావు గెలుపుకి లైన్ క్లియర్ చేసినట్టు అయ్యింది…మైలవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జోగి రమేశ్‌ను కాదని.

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్‌ను నియమించారు.విజయవాడ తూర్పులో నాలుగేళ్లు ఇన్‌చార్జిగా ఉన్న భవకుమార్‌ను తప్పించి.కొద్దినెలల క్రితం పార్టీలో చేరిన యలమంచిలి రవికి బాధ్యత అప్పగించారు.ఇలా కొన్ని స్థానాలలో వీక్ క్యాండెట్స్ ని పెట్టుకుని బీజేపీ కి లైన్ క్లియర్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది అయితే జగన్ ఈ భారీ త్యాగం ఆయన స్వార్ధం కోసం అయితే మా రాజకీయ జీవితాలు ఎందుకు బలిచేయడం అంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube