కౌన్ బనేగా కరోడ్ పతి తరహాలో 'కిత్నా బడా క్రైమ్' క్విజ్ ప్రోగ్రాం..ఈ ప్రోగ్రాం నిర్వాహకులు ఎవరు?అసలు దీని ఉద్దేశ్యం ఏంటి??

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.14 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే కోటి రూపాయలు గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించే ఈ గేమ్ షోకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు…మన తెలుగులోనూ మీలో ఎవరు కోటీశ్వరుడు పేరిట బాగానే క్లిక్ అయింది.దీనికి నాగార్జున,చిరంజీవిలు హోస్ట్ లుగా వ్యవహరించారు.అయతే ఇప్పుడు ఇదే తరహాలో రాజస్థఆన్ పోలిసులు ఒక ప్రోగ్రాం ను రూపొందిచారు.అదేంటంటే.

 Rajasthan Police Kbc Like Show For Awareness Of Crime-TeluguStop.com

కేబీసీతో స్ఫూర్తి పొందిన రాజస్థాన్ పోలీసులు ‘కిత్నా బడా క్రైమ్’ (కేబీసీ) పేరుతో ఓ క్విజ్ ప్రోగ్రాంను రూపొందించారు.చట్టాలు, నేరాలపై పౌరులకు అవగాహన కల్పించడంలో భాగంగా దీనిని రూపొందించారు.ఇందులో భాగంగా సెప్టెంబరు 24 నుంచి సోషల్ మీడియాలో రోజుకో ప్రశ్నను పోస్టు చేస్తున్నారు.

తొలి ప్రశ్న.‘‘ఇష్టం లేకపోయినా లైంగిక వాంఛలు తీర్చమని కోరడం ఐపీసీలోని ఏ సెక్షన్‌ కిందికి వస్తుంది?’’ అన్న ప్రశ్నకు (ఎ) సెక్షన్ 354 ఎ(II), (బి) సెక్షన్ 302, (సి) సెక్షన్ 420, (డి) వీటిలో ఏదీ కాదు.అని ఆప్షన్లు కూడా ఇచ్చారు.

ఈ ప్రశ్నకు 84 మంది స్పందించారు.

సరైన సమాధానాలు చెప్పే వారికి ప్రస్తుతం ఎటువంటి నగదు బహుమతి ఇవ్వడం లేదని, అయితే, ఇచ్చే ఆలోచన ఉందని ఏడీజీ (సీబీ అండ్ సీఐడీ) పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.ప్రజల స్పందనను బట్టి త్వరలోనే దీనిని అమలు చేస్తామన్నారు.

ఈ ఐడియా ఏదో బాగుంది కదా.ఇటీవల సుప్రిం ఇస్తున్న వరుస తీర్పులు సంచలనం కలిగిస్తున్నప్పటికి వాటి గురించి సరైన అవగాహన లేక ఎందరో తప్పుదోవ పట్టిస్తున్నారు.కాబట్టి ఇలాంటి కార్యక్రమం ద్వారా చట్టాలపై అవగాహన కల్పించడం హర్షించదగ్గ విషయమే.ALL THE BEST .RAJASTHAN POLICE.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube