'నా భార్యను నాకు అప్పగించండి.' కంటతడిపెట్టిన భర్త.! పోలీసులు ఏమన్నారంటే.?

నా భార్యను నాకు అప్పగించండి.మీడియా ముందు ఓ భర్త కంటది పెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

 Wife Abducted By In Laws Husband Raju-TeluguStop.com

ఇద్దరి మతాలు వేరైనా.వారి మనుసులు కలిశాయి.

తోడునీడగా ఉండాలని కలలు కన్నారు.కన్నవారిని ఎదిరించి.

కులం గోడలు దాటి ఒక్కటయ్యారు.మనసు ఇచ్చిన ప్రియుడి కోసం పేరు కూడా మార్చుకుంది ఆ ప్రియురాలు.

ఆర్యసమాజ్‌ సాక్షిగా ఆ జంట ఒక్కటైంది.వివరాలలోకి వెళ్తే…

బేగంబజార్‌కు చెందిన రాజు-నాజ్నీన్ అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్యసమాజ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.నాజ్నీన్ హిందూ మతాన్ని స్వీకరించి.

తన పేరును పూజగా మార్చుకుంది.

అయితే ఈ నెల 17 నుంచి ఆ యువతి కన్పించకుండా పోయిందని.ఆమెను తన కుటుంబసభ్యులు కిడ్నాప్‌ చేశారని రాజు ఆరోపిస్తున్నాడు.పరువు కోసం తన భార్యను చంపుతారని.

పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ప్రస్తుతం తన భార్య 4 నెలల గర్భవతని ఆమెకు అబార్షన్ చేయిస్తానని తండ్రి బెదిరిస్తున్నాడని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.పరువు కోసం తన భార్యను చంపుతారని… ఆమెను తనకు అప్పగించాలని రాజు మీడియా ద్వారా తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube