తెలంగాణాలో జనసేన .. టీఆర్ఎస్ కే లాభమా

తెలంగాణాలో ఎట్టి పరిస్థితుల్లోనూ… టీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదని.ఎలా అయినా ఆ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది.

 Janasena And Trs To Winning Chance In Telangana-TeluguStop.com

అందుకే ఒక మెట్టు కిందకి దిగి మరి టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు అన్నిటిని కలిపి మాహా కూటమి పేరుతో .కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ కేసీఆర్ పై యుద్ధం మూకుమ్ముడిగా చేయాలని దాదాపుగా నిర్ణయించాయి.ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ లో చీలిక రాకుండా చూడాలని కాంగ్రెస్ తాపత్రయపడుతోంది.అయితే విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో .జనసేన, సీపీఐ ఈ కూటమిలో ఉండేందుకు ఇష్టపడడం లేదు.ఈ చీలిక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణాలో కూడా జనసేనకు పట్టు ఉన్నట్టే కనిపిస్తోంది.దాదాపు ఎనిమిది లక్షల సభ్యత్వాలు కలిగి వుంది జనసేన.ఇక సీపీఎం విషయానికి వస్తే.వరంగల్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో బలంగా క్యాడర్ ఉంది.మహాకూటమితో జట్టు కట్టకుండా వీరిద్దరూ బరిలోకి దిగితే 30 స్థానాల్లో విపక్షం ఆశలపై నీళ్ళు చల్లే అవకాశాలు ఉన్నాయని లెక్కేస్తున్నారు విశ్లేషకులు.కెసిఆర్ కోరుకున్నది కూడా ఇటువంటి పరిణామమే.

జనసేన సిపిఎం అనుకోకుండా అదే పని చేస్తూ పరోక్షంగా టీఆర్ఎస్ కి మేలు చేకూర్చే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఇటువంటి పరిణామాలు వస్తాయని ముందే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు విపక్షాలన్నిటిని కలుపుకెళ్లేందుకు చూసింది.అయినా.జనసేన, సీపీఎం దూరంగా ఉండేలా కనిపిస్తుండడంతో కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి.

ముందునుంచి కూడా సీపీఎం కాంగ్రెస్ తో జట్టుకట్టడానికి వ్యతిరేకిస్తూనే ఉంది.జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగినా.

రాష్ట్ర నేతలు కాంగ్రెస్ తో పొత్తుకు ససేమిరా అంటున్నారు.ఈ పరిణామాలన్నీ టీఆర్ఎస్ కి ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

గులాబీ పార్టీని ఎదుర్కోవడానికి పవన్ ని మహా కూటమిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.అయితే.

ఆ కూటమిలో టీడీపీ ఉండడంతో పవన్ వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube