వారెవ్వా .. కాంబినేషన్ అదిరింది .. జగన్ పవన్ అక్కడ కలవబోతున్నారు

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల పొత్తులు చాలా విచిత్రంగా ఉంటాయి.ఎవరికీ ఎవరితో అవసరం ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు.

 Ys Jagan And Pawan Kalyan Janasena Meeting In Telangana-TeluguStop.com

అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది.ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి , జనసేనకు అస్సలు పొసగడంలేదు.

అది వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది.గతంలో ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ఊహాగానాలు వచ్చినా ప్రస్తుత పరిస్థితిని బట్టి అది అసాధ్యం అని తేలిపోయింది.

అయితే ఇక్కడ అది అసాధ్యం అయినా తెలంగాణాలో మాత్రం ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.దీనికి కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ .

కేసీఆర్ కి తొందరెక్కువ అందుకే ఎవరూ కంగారు పడకపోయినా ఆయన మాత్రం తెగ కంగారు పడిపోతూ.ముందస్తు ఎన్నికలకు వెళ్తూ .సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాడంటూ కొందరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.వారి అనుమానానికి త‌గిన కార‌ణం లేక‌పోలేదు.

సార్వ‌త్రికం అన్న‌ప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లుజ‌రుగుతున్న‌వేళ‌లో.తెలంగాణ మీద ప్ర‌త్యేకంగా దృష్టి ఎట్ట‌లేని ప‌రిస్థితి.

అదే ముంద‌స్తు అయితే.బీజేపీ.

కాంగ్రెస్ తో స‌హా ప‌లు పార్టీలు త‌మ దృష్టి మొత్తాన్ని తెలంగాణ మీద ఫోక‌స్ పెట్టే వీలు ఉంటుంది.ఈ వ్య‌వ‌హారం కేసీఆర్ కు కొత్త క‌ష్టాన్ని తెచ్చి పెట్ట‌దా? అన్న అనుమానం అందరిలో ఉంది.

దీనికి విరుగుడుగా కేసీఆర్ బలమైన శక్తిగా తెలంగాణాలో తిరులేని నాయకులేని నాయకుడిగా మారాలనుకుంటున్నాడు.అందుకే తన విజయానికి ఎదురు లేకుండా కొత్త మిత్రులను కూడగట్టుకుని తిరుగులేని విజయం సాధించాలని చూస్తున్నాడు.తన ప్రత్యర్థుల ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే సామర్ధ్యం జ‌న‌సేన‌, వైసీపీ లకు ఉందని కేసీఆర్ నమ్ముతున్నాడు.సామజిక వర్గాల లెక్కల ప్రకారం కూడా పవన్ , జగన్ కు బలమైన సామజిక వర్గం అండ ఉంది.

కాబట్టి వారిని చేరదీసి వారితో పొత్తు పెట్టుకుని తన ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేయాలనీ కేసీఆర్ చూస్తున్నాడు.ఆ విధంగా తెలంగాణాలో జనసేన , వైసీపీలను కేసీఆర్ కలపబోతున్నాడు.

అయితే కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగలేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube