ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కొంతకాలమే అయినా జనసేన అధ్యక్షుడు పవన్ రాజకీయాలు బాగానే వంటపట్టించుకున్నాడు.ఎప్పుడు ఏ ఎత్తు వేస్తే వర్కవుట్ అవుతుందో చూసుకుని మరీ తన అడుగులు వేస్తున్నాడు.
రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా అధికార పీఠం ఎక్కాలని ఆలోచనలో ఉన్న పవన్ అందుకు అనుగుణంగా తన రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నాడు.అందుకే జనసేనలో నమ్మకస్తులకు మాత్రమే చోటు కల్పిస్తూ వస్తున్నాడు.
తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం జనసేనలో మహిళల ప్రాధాన్యం పెంచడంతో పాటు ఈ అంశంతో మిగతా పార్టీలను ఇరుకునపెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు చూస్తున్నాడు.

వచ్చే ఎన్నికల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో నిలబెట్టే అభ్యర్ధుల్లో 33 శాతం అంటే దాదాపు 58 సీట్లు మహిళలకు కేటాయించాలనుకుంటుందట జనసేన అధిష్టానం.ఇలా చేయడం ద్వారా ఇతర పార్టీలపై కూడా ఒత్తిడి తీసుకురావచ్చనేది ఆ పార్టీ వ్యూహంమని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన సంకేతాలు వెళ్లిపోయాయని సమాచారం.
అందుకోసం రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో జనసేన మహిళా నేతలు బాగా యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది.తమ తమ స్థానాల్లో ఉత్సాహంగా తిరిగుతూ, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాగే జనసేనలో మహిళలకు పెద్ద పీట వెయ్యడం ద్వారా ప్రత్యర్థి పార్టీలను ఇరుకునపెట్టడమే కాకుండా మహిళా ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ఉంటుందని పవన్ ఆలోచన.ఇక పార్టీని అధికార పీఠం వైపు నడిపించేందుకు పవన్ గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు.అనుకూ పార్టీ కార్యకర్తలకు కొన్ని కొన్ని సూచనలు చేస్తున్నాడు.ఇటీవల పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ ఉద్దేశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని.జనానికి చేరువలో ఉండాలని అన్నారు.జనసేన బలోపేతానికి ప్రణాళిక బద్ధంగా అడుగులు వేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి అవుతామా.ప్రభుత్వం ఏర్పాటు చేస్తామా? అనేది తర్వాత ముందు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అంటూ కింది స్థాయి నేతలకు సూచిస్తున్నాడు.







