సిఎం బామర్దిని నాకే ఫైన్ వేస్తారా అంటూ వ్యక్తి హల్ చల్... నాకు బావలు ఎక్కువే అంటూ సిఎం వ్యాఖ్య..

నేను ఫలానా మంత్రి కొడుకుని,ఫలానా ఎమ్మెల్యే అల్లుడిని అంటూ పోలీసులను, అధికారులను తమ విధులను నిర్వర్తించుకోకుండా అడ్డుకునే వారిని చాలామందిని చూస్తూనే ఉంటాం.నిబంధనలు అతిక్రమిస్తే శిక్షించాలని పై స్థాయి వారు చెప్తుంటే వారి పేరు చెప్పుకుని ఆ నిబంధనలను అధిగమించేలా చేస్తుంటారు సదరు అధికారుల బంధువులు.

 Man Claiming To Be A Brother In Law Of Chief Minister Shivraj Singh 1-TeluguStop.com

ఇలాంటి ఘటనే ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగింది.సిఎం బామర్దిని నాకే ఫైన్ వేస్తారా అంటూ ఒక వ్యక్తి చేసిన దుమారం అంతా ఇంతా కాదు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా కొందరు నిబంధనలను అతిక్రమించి తమ వాహనాలకు సైరన్ పెట్టుకుంటూ పోలీసులకు చిక్కుతున్నారు.ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో వీటిపై తనిఖీ నిర్వహించాలని ఎన్నికల సంఘం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర అసెంబ్లీ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.సైరన్‌తో వస్తున్న ఓ కారును అడ్డగించారు.నిబంధనలకు విరుద్ధంగా సైరన్ పెట్టుకున్నందుకు ఆ కారులోని వ్యక్తికి జరిమానా విధించారు పోలీసులు.దీంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను సీఎం బావనని, తనకే జరిమానా విధిస్తారా? అంటూ వీరంగం సృష్టించాడు.అతడితోపాటు కారులో ప్రయాణిస్తున్న మహిళలు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇది సీఎం ఫోన్ నెంబర్.ఫోన్ చేస్తున్నా.

అంటూ రచ్చ చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి స్థానిక మీడియాలో వైరల్‌గా మారింది

.కాగా, సీఎం బంధువులమని చెబుతున్న వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.అయితే, సదరు కారు మాత్రం రాజేంద్ర సింగ్ చౌహాన్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందనేంటంటే ‘మధ్యప్రదేశ్‌లో నాకు చాలా మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు.దీంతో నాకు బావలు కూడా ఎక్కువే ఉంటారు.

అయితే, ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమిస్తే న్యాయపరమైన చర్యలు తప్పవు’ అంటూ సీఎం చౌహాన్ హెచ్చరించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube