ఫోటో:ఇన్ని సూదులు వాడితే పుట్టాడు..నెట్లో వైరలవుతున్న ఫోటో వెనుక కథ ఇదీ..

హృదయాకారంలో చుట్టూ వేల కొద్దీ సూదులు… మధ్యలో అమాయకంగా నిద్రపోతున్న బేబీ…ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఒక ఫోటో నెటిజన్ల గుండెల్ని పిండేస్తుంది.హార్ట్ సింబల్ లా సిరంజీలను చుట్టూ అమర్చి తీసిన ఫొటో చూసిన ప్రతి ఒక్కరికి ఆ బేబీకి, హార్ట్ సింబల్ కు, సిరంజీలకు ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలనే ఆసక్తి పెంచుతుంది.

 Baby London Was Wrapped In A Rainbow Blanket And With 1616 Needles-TeluguStop.com

పాట్రీసియా నీల్, కింబెర్లీ అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు.తమకు ఓ బిడ్డ కావాలని ఐయూఐ (ఇంట్రా యూటిరైన్ ఇన్‌సెమినేషన్) పద్ధతిని ఎంచుకున్నారు.ఇది కూడా సరోగసీ వంటి ఓ పద్ధతే.అది ఫెయిల్ కావడంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు.ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది.

దాదాపు నాలుగేళ్ల తరువాత వారి ప్రయత్నం ఫలించగా, పాట్రీసియా నెల తప్పింది.కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు తేల్చగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసి, ఈ బిడ్డను కంది.ఆపై ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను ఇలా పేర్చి, మధ్యలో తమ బిడ్డను ఉంచి ఈ ఫొటో తీసి సోషల్ మీడియాలో పంచుకుందీ జంట.1,616 సిరంజీలను వాడి వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారని, తాను తల్లి కావాలన్న కోరిక తీరిందని ఆనందంగా చెప్పింది పాట్రీసియా.అదీ సంగతి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube