మన జాతీయ జెండా ప్రస్థానం మొదలైందిలా...1906 నుండి 1947 వరకు..

మనం ఇప్పుడు 72వ స్వతంత్రదినోత్సవం జరుపుకుంటున్నాం.స్వాతంత్రదినోత్సవం అనగానే ముందుగా గుర్తుకువచ్చేది జెండా వందనం.

 From 1906 To 1947 The Evolution Of The Indian National Flag-TeluguStop.com

అంతటి ప్రాముఖ్యం కలిగిన జెండా ప్రస్థానం ఎప్పుడు మొదలైందో తెలుసా.స్వతంత్రం వచ్చింది 1947లోనేఅయినా మన జెండా రూపకల్పనకి ప్రయత్నాలు మొదలైంది 1906లో.

ఎన్నో మార్పులు చేర్పుల తర్వాత 1947లో జూలై 22న పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను జాతీయజెండాగా ఆమోదించారు.అంతకుముందు మన జెండా రూపకల్పన గురించి విశేషాలు.

1906లో సచ్చింద్ర ప్రసాద్,బోస్ సుకుమార్ మిత్రులు తొలిసారిగా జెండాని రూపొందించారు.ఇది తొలి అనధికారిక జెండా.

దీన్ని కలకత్తాలోని పార్శ్వీ బేగాన్ స్కేర్ వద్ద ఎగురవేశారు.కలకత్తా జెండాగా దీనికి పేరు.

మేడం బికాజి రుస్తుం కామాజెండాగా పేరుగాంచిన జెండాని మేడం బికాజి రుస్తుం,వీర సావర్కర్,శ్యామ్ జి క్రిష్ణవర్మలు రూపొందించారు.1907,ఆగస్టు22న జర్మనీలోని సట్గార్ట్ లో మేడం కామా ఈ జెండాని ఆవిష్కరించారు.

ఇండియాకు రాజ్యంగ ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ తో 1917లో చేపట్టిందే హోమ్ రూల్ ఉద్యమం.అప్పుడు డాక్టర్ అనిబి సెంట్,లోకమాన్య తిలక్ సప్తరుషి జెండాని ఎగురవేశారు.

దేశంలోని అన్ని మతాలను ప్రతిబింబించేలా తెలుపు,పచ్,ఎరుపు రంగులని ఉంచి.వీటన్నింటిని కలిపేలా అందులో రాట్నాన్ని ఉంచి నిర్మించిన జెండా సంయుక్త జెండా.1921లో దీన్ని రూపొందించారు.

1931లో కాంగ్రేస్ అధికారిక కమిటి జెండాని రూపొందించారు పింగలి వెంకయ్య.ఇందులో పైన కాషాయం మధ్యలో తెలుపు,కింద ఆకుపచ్చ రంగులు ఉండి మద్యలో రాట్నం ఉంటుంది.

1931 జెండాకే కొన్ని మార్పులు చేసి ప్రస్తుత జెండా తయారు చేశారు.ఇందులో రాట్నంకి బదులు అశోక చక్రం ఉంటుంది.మన తొలి రాష్ట్ర్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ జెండాని ఆమోదించారు.అప్పటి నుండి ఇప్పటివరకు మన జాతీయ జెండాగా ఇదే జెండా కొనసాగుతుంది.ఇది మన త్రివర్ణ పతాక ప్రస్థానం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube