ఓట్ల కోసం ఫీట్లు .. ఆ పదవుల భర్తీ వెనుక బాబు..కుల రాజకీయం

ఏపీ సీఎం చంద్రబాబు అపర చాణిక్యుడు .రాజకీయాల్లో బాగా ఆరితేరి ఉన్నాడు.

ఎప్పుడు ఏ పని చేస్తే తమకు లాభం వస్తుందో బాగా తెలుసు.లాభం లేకుండా ఊరికే ఏ పని చెయ్యడు ఇది అందరికి తెలిసిన వాస్తవమే.

తాజాగా ఆయన ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి తెర తీసాడు.వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు దాటుతున్నా వాటి గురించి పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు ఎన్నిక సీజన్ ని దృష్టిలో పెట్టుకుని పదవుల పంపకానికి తెరతీశాడు.దాని వెనుక కూడా పెద్ద రాజకీయమే ఉంది.

Advertisement

ఇప్పుడు భర్తీ చేసిన చేస్తున్న పదవులు అన్ని సామజిక వర్గాల వారీగా తమకు కలిసి వచ్చేలా పదవులను ఇస్తున్నాడు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది.గెలుపు కోసం ప్రతి పార్టీ తీవ్రంగా కష్టపడాలి.అందుకే .వ‌చ్చే ఎన్నిక‌ల్లో వివిధ సామాజిక వ‌ర్గాల‌ను త‌న పార్టీవైపున‌కు తిప్పుకోవడం కోసం బాబు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.ఈ క్ర‌మంలోనే అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన వంటి కీల‌క పార్టీలు సామాజిక వ‌ర్గాల‌ను రెచ్చగొడుతున్నాయి.

జ‌గ‌న్ ఏకంగా బీసీల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో చిన్న పొర‌పాటు చేసి.మ‌ళ్లీ నాలిక క‌రుచుకున్నారు.ఇక‌, పైకి తాను కుల ర‌హిత రాజ‌కీయాలు చేస్తాన‌ని చెబుతున్నా.

కాపుల అండ త‌న‌కే ఉంటుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ బలంగా నమ్ముతున్నాడు.ప్రస్తుత రాజకీయ లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతు వైసీపీ కి ఉందనేది ఒక అంచనా.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఈ క్రమంలో చంద్ర‌బాబు వీటికి కూడా గండి కొట్టే వ్యూహానికి ప‌దును పెంచారు.అందుకే .వివిధ కార్పొరేష‌న్ల‌ను బ‌లోపేతం చేస్తున్నారు.మైనార్టీ కార్పొరేష‌న్‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన కార్పొరేష‌న్‌, ఆఖ‌రుకు దూదేకుల కార్పొరేష‌న్‌కు కూడా చైర్మ‌న్‌ను నియ‌మించ‌డం ద్వారా భారీగా ఓట్ల‌ను రాబట్టే ప్లాన్ వేసాడు.

Advertisement

మొదటి నుంచి టీడీపీ వైపు ఉన్న బీసీలు ఈసారి ఆ పార్టీ మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.దీనికి ప్ర‌ధాన కార‌ణం కాపు సామాజిక వ‌ర్గానికి చంద్ర‌బాబు పెద్ద పీట వేసి.వారికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ.

అసెంబ్లీలో తీర్మానం చేశారు.దీనిని కేంద్రానికి పంపారు.

దీనిని కేంద్రం ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి కూడా చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రెండు రోజుల కిందట పార్ల‌మెంటులో ప‌దినిముషాల పాటు మాట్లాడారు కూడా .దీంతో త‌మ రిజ‌ర్వేష‌న్ల‌కు చంద్ర‌బాబు ముప్పు తెస్తున్నార‌ని బీసీ వ‌ర్గాలుఆందోళన చెందుతున్నాయి.అందుకే వారిని బుజ్జగించేందుకు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ప్రాధాన్యం ఉండేలా వారికే ఎక్కువ పదవులు కేటాయింపు చేస్తూ .ఆ సామజిక వర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు బాబు చూస్తున్నాడు.

తాజా వార్తలు