విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఆగస్టు 15న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ చిత్రం పది రోజుల ముందే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమాను కొత్త తరహాలో పబ్లిసిటీ చేయాలని భావిస్తున్నారు.సహజంగా సినిమా విడుదలైన తర్వాత సెన్సార్ సందర్బంగా డిలీట్ చేసిన సీన్స్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు.
కాని ఈ చిత్రం విషయంలో రివర్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

‘గీత గోవిందం’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కొన్ని సీన్స్‌ను తొలగించాలని, లేదంటే ఏ ఇస్తామని చిత్ర యూనిట్‌కు సెన్సార్ బోర్డు సూచించింది.ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రంను దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో యూ/ఎకు ఓకే చెప్పారు.దాంతో హీరో, హీరోయిన్ మద్య ఉండే రొమాంటిక్ సీన్స్ మిస్ అయ్యాయి.
ఇద్దరి మద్య కొన్ని ముఖ్యమైన సీన్స్‌ను తొలగించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
ఆ ఉద్దేశ్యంతోనే చిత్ర యూనిట్ సభ్యులు డిలీట్ చేసిన సీన్స్‌ను యూట్యూబ్ ద్వారా సినిమా విడుదలకు ముందే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
సినిమా కథ రివీల్ కాకుండా ఉండటంతో పాటు, ఆ డిలీట్ సీన్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేలా ఉండేలా చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.దాదాపు ఆరు లేదా ఎనిమిది సీన్స్‌ను చిత్ర యూనిట్ సభ్యులు యూట్యూబ్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఆ సీన్స్‌తో సినిమా స్థాయి ఖచ్చితంగా పెరుగుతుందని, రొమాంటిక్ సీన్స్‌తో పాటు, ఈ చిత్రంలో కామెడీ కూడా ఫుల్‌గా ఉంటుందని ఆ సీన్స్‌ను చూస్తే అర్థం అయ్యేలా చిత్ర యూనిట్ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు.

గీత గోవిందం చిత్రంపై ఇప్పటికే యూత్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.ఆ క్రేజ్‌ను ఇప్పుడు ఈ డిలీట్ వీడియోలు రెట్టింపును చేయడం ఖాయంగా కనిపిస్తుంది.భారీ ఎత్తున ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు పరుశురామ్ దర్శకత్వం వహించగా మెగా కాంపౌండ్‌కు చెందిన బన్నీ వాసు నిర్మించాడు.
అర్జున్ రెడ్డిని మించేలా ఈ చిత్రం వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ డామినేషన్ ఉంటుందని టీజర్ మరియు పాటలు చూస్తుంటే అనిపిస్తుంది.
సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.







