టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులను ఎప్పుడూ కంగారు పెడుతూనే ఉంటారు.ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీలో ఫోన్ కాల్ వ్యవహారం సంచలనంగా మారింది.
అదే స్వయంగా కేసీఆర్ కొంతమంది ఎమ్యెల్యేలకు, నాయకులకు స్వయంగా ఫోన్ లు చేయడం చర్చనీయాంశం అయ్యింది.అధినేత ఫోన్ ఎప్పుడు చేస్తాడా ఏం మాట్లాడుతాడా అని నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు.
ఇప్పటికే ఫోన్ కాల్ అందుకున్నవారితో కేసీఆర్ ఏమి మాట్లాడాడో ఆరా తీసే పనిలో ఉన్నారు.

ఎన్నికలకు సిద్ధం కావాలంటూ శాసనసభ్యులకు సంకేతాలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌టెలిఫోన్లో నియోజకవర్గాల వారీగా ఆరా తీస్తున్నారన్న ప్రచారం ఎమ్మెల్యేల్లో కొత్త గుబులు రేపుతోంది.సీఎం నుంచి ఎవరెవరికి ఫోన్లు వచ్చాయంటూ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు.పార్టీ నిర్వహిస్తున్న సర్వేల ద్వారా ప్రభుత్వానికి సానుకూలంగా ఉందన్న ఫలితాలు వస్తున్నా, శాసనసభ్యులు పరంగా వ్యతిరేకత ఉందన్న సమాచారం ఎక్కువగా అందుతున్నట్టు తెలుస్తోంది.
దీంతో నియోజకవర్గాల వారీగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం.

ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యులుగా ఉన్న వారికి తిరిగి అదే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం కల్పిస్తే.ఆ స్థానాలు దక్కడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.దీంతో ఆ శాసనసభ్యులను ఇతర నియోజకవర్గాలకు మార్చడమా… లేదంటే అక్కడే కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడమా అన్న అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఒక్కరిద్దరు శాసససభ్యులకు నియోజకవర్గాలు మారి పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలన్న సంకేతాలు సీఎం కేసీఆర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే అధినేత నుంచి ఇప్పటికే ఫోన్ కాల్ అందుకున్నవారు ధీమాగా ఉండగా … అందుకొని వారిలో కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఒకవేళ ఫోన్ రాకపోతే ఇక టికెట్ లేనట్టేనా అన్న అనుమానం వారిలో ఉంది.







