తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఇంకా ముందస్తు ఫీవర్ తగ్గలేదు.అసలు ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో అన్న విషయాన్ని పక్కనపెడితే ఎందుకైనా మంచి అందుకు సిద్ధంగా ఉంటె బెటర్ అన్న ఆలోచనలో గులాభీ బాస్ ఉన్నాడు.
అందుకు తగ్గట్టుగానే పార్టీ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నాడు.పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల సేవలు పూర్తిగా ఉపయోగించుకుని పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తున్నాడు.

ముందస్తు ఎన్నికలపై ఇప్పటికీ ఒక క్లారిటీ రానప్పటికి పక్కా ప్లాన్‌తో రంగంలో దిగేందుకు స్కెచ్‌లు వేస్తున్నారు.ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచడంతో పాటు కీలక నేతలందరికీ ముందస్తు సంకేతాలు అందించి అందుకు తగ్గట్లుగా పక్కా వ్యూహం రచించాలని సూచనలు ఇస్తున్నారు.ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్నారు.అందుకే పార్టీ యంత్రాంగాన్నంత ముందస్తుకు రెడీ చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాల అమలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నేరవేరాయి ప్రభుత్వ పనితీరుపట్ల ప్రజలు ఎంత మేర సంతృప్తిగా ఉన్నారని పార్టీ నాయకుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు , ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడానికి ఏమి చెయ్యాలి అనే అంశాలపై కేసీఆర్ప్ర లెక్కలు వేసుకుంటున్నాడు.అందుకు ఇప్పటి నుంచే … పార్టీ జెండాలు, కరపత్రాలు, బుక్‌లెట్లు, ప్రచార రథాలను రెండు నెలల్లో సిద్ధం చేయాలని సూచనలు ఇస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ సందర్భంగా పాటలు కీలక పాత్ర పోషించిన దృష్ట్యా అదే స్థాయిలో పథకాలపై పాటలను రూపొందించాలని ఆదేశాలు జరీ చేసాడట.ఇక ఎన్నికల వేళ కేసీఆర్ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, మంత్రులను ఎంపీలుగా పోటీ చేయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఏమైనా కేసీఆర్ లో ఎన్నికల ఫీవర్ బాగా ముదిరినట్టు కనిపిస్తోంది.







