రాజన్న సినిమాలో మల్లమ్మ గా నటించిన ఈ చిన్నారి గుర్తుందా.? ఇప్పుడెలా ఉందొ.? ఏం చేస్తుందో తెలుసా.?

వెయ్…వెయ్…వెయ్యరా వెయ్యి అని అంటే ఏమి చేతకాని వాడు కూడా ఎగిరెగిరి తన్నగలతాడు.అది రాజన్న వాయిస్ లో ఉండే బేస్.

 Unknown Facts About Baby Annie-TeluguStop.com

రాజన్న సినిమాలో నాగార్జున క్యారెక్టర్ అలాంటిది.అతనికి తోడుగా లచ్చమ్మ కూడా జానపద పాటల్లో స్టెప్పులతో ఇరగదీసింది.

సమాజంలో బడుగు వర్గాలపై సొమ్ములున్న వారు చేసే అన్యాయాలపై ఎదిరిస్తాడు రాజన్న, వారిద్దరికీ పుట్టిన సంతానమే “మల్లమ్మ”.చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకుని తాత దగ్గర కష్టాలు పడుతూ పెరుగుతుంది.

ఢిల్లీ కి వెళ్లి ప్రెసిడెంట్ ని కలవడానికి దారిలో ఎన్నో కష్టాలు పడుతుంది.చివర్లో వచ్చే “అమ్మ అవని” పాటకు ఆడియన్స్ అందరు ఫిదా అయ్యారు.

ఈ సినిమా ద్వారా మల్లమ్మ గా నటించిన బేబీ ఆని ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది.

ఆ ఒక సినిమాతోనే ఆ బేబీ చాలా పాపులర్ అయిపొయింది.ప్రస్తుతం తెలుగులోనే కాదు.తమిళ, కన్నడ, మలయాళం బాషలలో కూడా నటిస్తూ సౌత్ ఇండియా చైల్డ్ ఆర్టిక్స్ట్ గా పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం పలు టాప్ సీరియల్స్ లలో కూడా నటిస్తూ మంచి పేరే తెచ్చుకుంది.ఆ మధ్య రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెల్లెలు గా నటించి హౌరా అనిపించుకుంది.

అన్నయ ఆది చనిపోయినప్పుడు ఏడుస్తూ చేసిన యాక్టింగ్ చూసి అందరు ఆమెకు మంచి భవిష్యతు ఉందని కితాబిస్తున్నారు.ఇప్పటికే బేబీ అన్నీ తన అద్భుత నటనకు గాను 2 నంది అవార్డులు అందుకుంది.

3 ఏళ్ల వయసులోనే వెండి తెరకు పరిచయం అయింది.6 ఏళ్ల వయసులోనే మొదటిసారి “ట్రాప్” అనే “టెలీఫిల్మ్” లో నటించి అవార్డు పొందింది.గోరింటాకు అనే సీరియల్ లో అద్భుతంగా నటించినందుకు గాను 2010 లో టీవీ నంది అవార్డు దక్కింది.ఆ తరువాత అతిధి , స్టాలిన్, ఏక్ నిరంజన్, విక్రమార్కుడు తదితర చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఆమె కుటుంబం విషయానికి వస్తే .బేబీ అన్నీ హైదరాబాద్ లోనే పుట్టినప్పటికీ తల్లిదండ్రులు తెలుగువారు కాదు.వారు మలయాళీలు.ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లోనే నివాసం ఏర్పరచుకున్నారు.అన్నీ కు తెలుగుతో పటు మలయాళం కూడా బాగా వచ్చు.ఇన్ని సినిమాల్లో నటించింది ఫామిలీ బాక్గ్రౌండ్ ఉంది అనుకునేరు.

కానీ ఎలాంటి సినిమా బాక్గ్రౌండ్ లేని ఫామిలీ నుండి వచ్చి అందరిని ఆకట్టుకుంది ఈ చిన్నారి.

అనగనగ ఓ రాజు అనే సినిమాతో అన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించింది.

ఇప్పటివరకు 25 సినిమాలలో నటించింది.చిరంజీవి, మహేష్ బాబు బాలకృష్ణ, జగపతిబాబు గోపీచంద్, రవితేజ, రామ్ లతో కలసి నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube