వైసీపీ అధ్యక్షుడు జగన్ అతి సున్నితమైన అంశాన్ని టచ్ చేశాడు.ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న తరుణంలో ఎవరూ కావాలని ఎటువంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లరు.
కానీ ఇక్కడే జగన్ చాలా తెలివిగా వ్యవహరించి తమ పార్టీకి ఇబ్బంది లేకుండా ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేసాడు.కాపు రిజర్వేషన్ పై తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన నేను ఇస్తాను అని చెప్పి మోసం చెయ్యలేను.
కాకపోతే ప్రస్తుత కాపు కార్పొరేషన్ కి కేటాయించిన నిధులను రెట్టింపు చేస్తాను అని తన పార్టీ విధానం స్పష్టంగా ప్రకటించాడు.

జగన్ ఇచ్చిన క్లారిటీతో టీడీపీ జనసేన కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి.కాపు రిజర్వేషన్ అంశంపై రెండు పార్టీలు ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి జగన్ కల్పించారు.టిడిపి కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నాలుగేళ్ళు గా అమలు చేయాలకేకపోవడం తో ఇప్పుడు దీనికోసం పోరాడుతున్నామని చెప్పినా చట్టబద్ధ హామీలనే కేంద్రం తో అమలు చేయించలేక నిస్సహాయస్థితిలో ఉన్నారు.
ఆ పార్టీపై కోపంతో వారంతా జనసేన వైపే చూస్తున్నారు.కానీ జనసేన కాపు రిజర్వేషన్లు అంశంపై పూర్తి స్పష్టత ఇప్పటివరకు ఇవ్వలేదు.ఈ విషయంపై టీడీపీ మీద నిందలు అయితే వేసింది కానీ ఇప్పుడు తన అభిప్రాయం తప్పనిసరిగా సూటిగా చెప్పాల్సిన అవసరం వచ్చింది.
కాపులకు రిజెర్వేషన్ కల్పించే అంశంపై ఎప్పటి నుంచో బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.
గోదావరి జిల్లాల్లో బీసీలు -కాపులు ఉప్పు నిప్పులా ఉంటారు.అయితే తమకు బిసిలకు వున్న రిజర్వేషన్ నుంచి ఇచ్చే కోటా కోరడం లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వంటివారు ప్రకటించినా బిసిల ఆగ్రహం చల్లారలేదు.
సుప్రీం కోర్టు స్పష్టంగా ఈ అంశంపై తేల్చి చెప్పాకా రాజ్యాంగం లోని 9 వ షెడ్యూల్ సవరించాలని స్పష్టం చేస్తున్నా టిడిపి ఓటు బ్యాంక్ రాజకీయంతో కాపులను గత ఎన్నికల్లో కరివేపాకు చేసిందని వైసిపి ప్రచారం చేసింది.జనసేన సైతం ఇస్తామంటే ఇవ్వాలని ఇవ్వడం సాధ్యం కాకపోతే లేదని తేల్చాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో వైసిపి ఈ సున్నిత అంశంలో కీలక నిర్ణయం తీసుకుని తన వైఖరి కుండబద్ధలు కొట్టేసింది .తద్వారా అటు టిడిపి, ఇటు జనసేనలను ఇరకాటంలోకి నెట్టింది.








